రూ.900 కంటే తక్కువ ధరలో ప్రతిరోజు 2GB హైస్పీడ్ డేటాను అందించే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు..!
భారత్ టెలికాం రంగంలో అత్యధిక యూజర్లతో జియో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియో, ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఉన్నాయి. ప్రస్తుతం జియో తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వ్యాలిడిటీ, డేటా, కాలింగ్ ప్రాతిపదికన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.900 కంటే తక్కువ ధరలో ప్రతిరోజు 2GB హైస్పీడ్ డేటాను అందించే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల (Jio 2GB Data Recharge Plans) వివరాలు, ప్రయోజనాలు మీకోసం.
రూ.198 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్లాన్‌లో (Jio RS198 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. దీంతోపాటు జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు.

జియో రూ.349 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు.
రూ.448 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా సోనీ LIV, ZEE5, సన్ NXT, డిస్కవరీ+ సహా మరిన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.629 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ఏకంగా 56 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిడెట్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. జియో యాప్స్‌కు యాక్సెస్ ఉంటుంది.
జియో రూ.719 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా సహా 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది.
రూ.749 ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. వీటితోపాటు జియో యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో రీఛార్జ్‌పై 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ప్రతిరోజు 2GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
రూ.899 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








