రూ.500 కంటే తక్కువ ధరలో ప్రతిరోజు 1.5GB డేటా అందించే జియో రీఛార్జ్ ప్లాన్‌లు..!
జియో తొమ్మిదో వార్షికోత్సవం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అనేక ప్రకటనలు చేసింది. 50 కోట్ల మంది యూజర్ల మార్కు ను దాటినట్లు తెలిపింది. రూ.349 రీఛార్జ్, ఆపై రీఛార్జ్ ప్లాన్ లను కలిగిన వారికి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో ప్రస్తుతం అనేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది.
యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, డేటా, ఓటీటీ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.500 కంటే తక్కువ ధరలో రోజువారీ 1.5GB డేటా అందించే జియో రీఛార్జ్ ప్లాన్ లు మీకోసం. రూ.239, రూ.299, రూ.319, రూ.329 వంటి ప్లాన్ లను కలిగి ఉంది.

జియో రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs239 Recharge plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 33GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా జియోటీవీ, జియోAI క్లౌడ్ వంటి యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు
జియో రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs299 Recharge plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 42GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా జియోటీవీ, జియోAI క్లౌడ్ వంటి యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.319 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Jio Rs319 Recharge plan) వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ వంటి యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు.
జియో రూ.329 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవ్చచు.
ఈ ప్లాన్ (Jio Rs329 Recharge plan) వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 42GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా JiosaavnPro సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు. వీటితోపాటు జియోటీవీ, జియోAI క్లౌడ్ వంటి యాప్స్ ను కూడా వినియోగించుకోవచ్చు


Click it and Unblock the Notifications








