ఎక్కువగా డేటా ఉపయోగిస్తుంటారా.. రూ.500 కంటే తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు..!
Jio 2GB Data Recharge plans : జియో ప్రస్తుతం యూజర్ల పరంగా దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ గా ఉంది. గత నెలలో టారిఫ్‌ల పెంపు అనంతరం భారీ సంఖ్యలో యూజర్లు ఇతర నెట్‌వర్క్ లకు పోర్టింగ్ అయినా.. అనంతరం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అంటే ప్రతినెల భారీగా కొత్త యూజర్లు నెట్‌వర్క్ లో చేరుతున్నారు. అయితే రోజువారీ ఎక్కువగా డేటాను ఉపయోగించే యూజర్ల కోసం జియో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది.
ప్రస్తుతం జియో రోజువారీ 1GB డేటా, 1.5GB డేటా, 2GB, 2.5GB, 3GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్ లు కూడా ఉన్నాయి. అయితే ఇందులో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్ లు కూడా ఉన్నాయి. మరియు ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాలు వివరాలు.

జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.
అయితే ( Jio Rs198 Recharge Plan ) 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోAIక్లౌడ్ యాప్స్ ను వినియోగించుకోవచ్చు.
జియో రూ.349 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 56GB 4G డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ లో ( Jio Rs349 Recharge Plan ) భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీ తో జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోAIక్లౌడ్ యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.445 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 56GB 4G డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోAIక్లౌడ్ యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
వీటితోపాటు (Jio Rs445 Recharge Plan) Sony LIV, ZEE5, Sun NXT, డిస్కవరీ ప్లస్, లైట్‌గేట్ ప్లే, kanchha, planet, marathi, ఫ్యాన్‌కోడ్ సహా మరిన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. జియోటీవీ యాప్ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








