మీరు ఎక్కువగా డేటాను వినియోగిస్తుంటారా.. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లు మీకోసమే..!
జియో ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా అతిపెద్ద నెట్‌వర్క్ గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తమ యూజర్ల కోసం అనేక ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్, డేటా, OTT అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. భారీగా డేటా అవసరం అయ్యే యూజర్ల కోసం కూడా ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
ప్రస్తుతం జియో 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3GB హైస్పీడ్ డేటాను అందించే రెండు రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తున్నాయి. ఎక్కువ డేటా తోపాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కలిగిన ఫ్లాన్ ల కోసం చూసే యూజర్లకు ఈ ప్లాన్ లు అనుకూలంగా ఉంటాయి.

జియో రూ.1199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1199 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ మరియు STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 3GB డేటాను అందిస్తుంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 252GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఎక్కువ డేటా అవసరం ఉండే యూజర్లు ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
జియో రూ.1799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1799 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం డేటా స్పీడ్ 64kbps గా ఉంటుంది.
అయితే 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఫలితంగా మొత్తంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. మరియు జియోటీవీ, జియో క్లౌడ్ యాప్స్ ను వినియోగించుకోవచ్చు.
మరో జియో రీఛార్జ్ ప్లాన్ కూడా (Jio 3GB Data Recharge Plans) ప్రతిరోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తుంది. జియో రూ.449 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో ప్రతిరోజు 3GB డేటాను అందిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 84GB డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో క్లౌడ్, జియో టీవీ యాప్‌లను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








