Home
News

డేటాను ఎక్కువగా వినియోగిస్తుంటారా.. ఈ మూడు ప్లాన్‌లు మీకోసమే.. జియోహాట్‌స్టార్‌ కూడా..!

జియో (Jio) ప్రస్తుతం యూజర్ల పరంగా దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. గత సంవత్సరం జులైలో మొబైల్ టారిఫ్‌ల పెంపు అనంతరం భారీ సంఖ్యలో యూజర్లు జియోకు గుడ్‌బై చెప్పి.. ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అయ్యారు. అయితే అనంతరం పరిస్థితి సర్దుమణిగింది. ఇప్పటికే జియో తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. కాలింగ్‌, డేటా, ఓటీటీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను అందుబాటులో తీసుకొచ్చింది.

ప్రస్తుతం 1GB డేటా, 2GB, 2.5GB, 3GB డేటాతో జియో రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం రోజువారీ 3GB డేటాను అందించే మూడు రీఛార్జ్‌ ప్లాన్‌లను జియో కలిగి ఉంది. ఈ లిస్ట్‌లో రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌, రూ.1199 ప్లాన్, రూ.1799 రీఛార్జ్‌ ప్లాన్లు ఉన్నాయి.

Jio Prepaid Recharge plans with 3GB daily data

రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ :
జియో (Jio Rs449 Recharge Plan) యూజర్ల ఈ ప్లాన్‌లో భాగం అన్‌లిమిటెడ్‌ లోకల్‌ / STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి రోజు 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం డేటా స్పీడ్‌ 64 kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 84GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియో AI క్లౌడ్‌ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

ఈ జియో ప్లాన్‌లో భాగంగా యూజర్లు జియోహాట్‌స్టార్‌ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న IPL తోపాటు ఇతర వీడియో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

రూ.1199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1199 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లా్న్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్న్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 252GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియో AI క్లౌడ్‌ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. జియోహాట్‌స్టార్‌ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న IPL తోపాటు ఇతర వీడియో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

జియో రూ.1799 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1799 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్న్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 252GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియో AI క్లౌడ్‌ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

జియోహాట్‌స్టార్‌ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న IPL తోపాటు ఇతర వీడియో కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Prepaid Recharge plans with 3GB daily data here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X