రెండు నెలల వ్యాలిడిటీతో జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. కాలింగ్, డేటా ప్రయోజనాల పూర్తి వివరాలు
భారత టెలికాం రంగంలో అత్యధిక యూజర్లతో జియో (Jio) తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను జియో అందిస్తోంది. అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ భారీగా ఉంది. గత ఆరు నెలల ముందు వరకు BSNL నామమాత్రంగా ఉండేది. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా 17 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ BSNL లాభాల్లోకి వచ్చింది.
ప్రస్తుత పోటీని తట్టుకొనే విధంగా జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. యూజర్ల డేటా, OTT, కాలింగ్ అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో సుమారు నెలవారీ, రెండు నెలలు, మూడు నెలలు, సంవత్సరం రీఛార్చ్ ప్లాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కథనంలో 56 రోజుల వ్యాలిడిటీతోపాటు అంతకంటే ఎక్కువ వ్యాలిడిటీ అందించే ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

జియో రూ.579 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. టేడా పరంగా ప్రతిరోజు 1.5GB 4G హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వేగం అనంతరం 64kpbs కు తగ్గుతుంది.
ఈ ప్లాన్ (Jio Rs579 Recharge Plan) వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ మొత్తంగా 84GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ వంటి ప్రయోజనాలకు కూడా వినియోగించుకోవచ్చు.
జియో రూ.629 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB హైస్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం 64kbps వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs629 Recharge Plan) వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 112GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ వంటి యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.
జియో రూ.666 రీఛార్జ్ ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. హైస్పీడ్ డేటా వినియోగం అనంతరం డేటా వేగం 64Kbps గా ఉంది.
ఈ ప్లాన్ (Jio Rs666 Recharge Plan) వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 105GB గా ఉంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు.
జియో రూ.719 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిడెట్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs719 Recharge Plan) వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. మొత్తంగా 140GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం ప్రయోజనాలను పొందే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications








