Home
News

OTT సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. అన్‌లిమిటెడ్‌ 5G డేటా సహా ఎన్నో ప్రయోజనాలు..!!

ప్రముఖ టెలికాం దిగ్గజం జియో.. ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ల ద్వారా కాలింగ్‌, డేటా, SMS ప్రయోజనాలతోపాటు OTT లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో సినిమా సహా ఇతర ప్రయోజనాలను (Jio Prepaid Recharge Plans With OTT Subscriptions) పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ లేదా అమెజాన్‌ వీడియో లేదా డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

OTT తో కూడిన జియో రీఛార్జ్‌ ప్లాన్‌లులో టాప్‌ 5 ప్లాన్‌ల వివరాలు మీకు అందిస్తున్నాం. వీటిలో కనిష్ఠంగా రూ.175 నుంచి గరిష్ఠంగా రూ.1299 గా ఉంది. ఈ ప్లాన్‌లు కనీసం ఒక OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. మరియు జియో ఓటీటీ ప్లాట్‌ఫాలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.175 ప్లాన్‌ మినహా మిగిలిన నాలుగు రీఛార్జ్‌ ప్లాన్‌లు 2GB రోజువారీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు.

Top five Jio prepaid Recharge Plans with OTT Subscriptions

రూ.175 రీఛార్జ్‌ ప్లాన్‌ :
జియో రూ.175 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. 10GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. జియో సినిమా ప్రీమియం సహా Zee5, సన్‌ NXT, సోనీ Liv సహా మొత్తంగా 12 OTTలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జియో టీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

జియో రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా రోజువారీ 2GB డేటా, 100 SMS లతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లతోపాటు 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ జియో రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS, 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీంతోపాటు Sony LIV మరియు ZEE5 ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు.

రూ.1299 ప్లాన్‌ : ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లు సహా ప్రతిరోజు 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio prepaid Recharge Plans with OTT Subscriptions benefits and validity details 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X