జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

అంతా ఊహించినట్లుగానే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్, జియో ప్రైమ్ ఆఫర్ తేదీని మరో 15 రోజుల పాటు పొడిగించింది. అంటే, ఏప్రిల్ 15వ తేదీ వరకు జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

Read More : రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

7.2 కోట్ల మంది యూజర్లు జియో ప్రైమ్ తీసుకున్నారు..

దేశవ్యాప్తంగా 7.2 కోట్ల మంది యూజర్లు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను సబ్‌స్కైబ్ చేసుకున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.

ఏప్రిల్ 15, 2017 వరకు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్

రిలయన్స్ తాజా ప్రకటన నేపథ్యంలో మార్చి 31, 2017తో ముగుస్తుందని భావిస్తోన్న జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మరో ఏప్రిల్ 15, 2017 వరకు అందుబాటులో ఉంటుంది.

Jio Summer Surprise

‘Jio Summer Surprise' పేరుతో మరో ఆసక్తికర ప్లా‍‌‌న్‌ను కూడా రిలయన్స్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ.402తో 5 నెలల బెనిఫిట్స్...

Jio Summer Surprise ఆఫర్‌లో భాగంగా జియో యూజర్ రూ.303 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవటం ద్వారా కాంప్లిమెంటరీ క్రింద మరో మూడు నెలలు సర్వీస్ ఉచిత లభిస్తుంది. అంటే, రూ.303 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా నాలుగు నెలల పాటు ఆఫర్ తాలుకా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. రూ.402 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా ఐదు నెలల పాటు ఆఫర్ తాలుకా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime Enrollment Deadline Till April 15. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot