కొత్త ఆఫర్, రోజుకు 2జీబి Jio డేటా, సంవత్సరమంతా కాల్స్ ఉచితం

Jio Prime membership ప్లాన్స్‌కు సంబంధించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను రిలయన్స్ జియో రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

31,2017లోపు రూ.99 చెల్లించాలి..

ప్రస్తుత జియో యూజర్లు మార్చి 31,2017లోపు రూ.99 చెల్లించి ప్రైమ్ మెంబర్ షిప్‌ను పొందటం ద్వారా మార్చి 31, 2018 వరకు ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ 12 నెలల మెంబర్‌షిప్ పిరియడ్‌లో భాగంగా నెలకు రూ.303 చెల్లించటం ద్వారా రోజుకు 1జీబి హై-స్పీడ్ 4జీ డేటాను పొందటంతో పాటు జియో మీడియా సర్వీసులను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

Made in India ట్యాగ్‌తో నోకియా ఫోన్‌లు

మరో రెండు కొత్త ప్లాన్‌లు..

రూ.303 ప్లాన్ మాత్రమే కాకుండా మరో రెండు కొత్త ప్లాన్‌లను కూడా Jio Prime యూజర్ల కోసం రిలయన్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

నోకియా స్నేక్ గేమ్ ఇప్పుడు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో

రూ.149 ప్లాన్ ప్రత్యేకతలు ఇవే..?

వీటిలో రూ.149 ప్లాన్ మొదటిది. ఈ ప్లాన్‌లో కేవలం 2జీబి డేటా మాత్రమే లభిస్తుంది. ఈ డేటాను నెల మొత్తం పొదుపుగా వాడుకోవల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్ మాత్రం పూర్తిగా ఉచితం.

ఏదికొన్నా 50% తగ్గింపు, సామ్‌సంగ్ సంచలనం

రూ.499 ప్లాన్‌తో...

మరో ప్లాన్ రూ.499. ఈ ప్లాన్‌లో 60జీబి డేటా లభిస్తుంది. రోజుకు 2జీబి చొప్పున నెల మొత్తం వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ మాత్రం పూర్తిగా ఉచితం.

మార్చి 15నే మోటో జీ5 రిలీజ్..

ఏ విధమైన డైలీ లిమిట్స్ లేకండా

ఇదే సమయంలో ఏ విధమైన డైలీ లిమిట్స్ లేకండా రూ.999 ప్లాన్ (60జీబి డేటా, 60 రోజుల వ్యాలిడిటీ), రూ.1999 ప్లాన్ (125జీబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ), రూ.4999 ప్లాన్ (350జీబి డేటా, 180 రోజుల వ్యాలిడిటీ), రూ.9999 ప్లాన్ (750జీబి డేటా, 360 రోజుల వ్యాలిడిటీ)లను కూడా జియో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

నెలకు 1000 నిమిషాలు మాత్రమే..?

ఈ ప్లాన్‌లలో భాగంగా జియో టు జియో కాల్స్ ఉచితంగా లభిస్తాయట. బయట నెట్‌వర్క్స్ విషయానికి వచ్చేసరికి నెలకు కేవలం 1000 నిమిషాలు మాత్రమే ఉచితంగా లభిస్తాయట. మార్చి 31, 2017లోపు Jio Prime సభ్యత్వాన్ని తీసుకోని వారి కోసం జియో స్టాండర్డ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime membership opens on March 1: New tariff plans revealed. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot