జియో ప్రైమ్‌ ఉచిత రెన్యువల్ కనిపించడం లేదా, అయితే ఇలా చేయండి

Written By:

దేశీయ టెలికా రంగంలో దూసుకుపోతున్న జియో ప్రైమ్ యూజర్ల కోసం మరో శుభవార్తను మోసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తూ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. జియో ప్రైమ్‌ మెంబర్లుగా ఉన్న వారికి మరో ఏడాది పాటు ఈ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. దీంతో యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. అయితే అదే సమయంలో చాలామంది యూజర్లను నిరాశ వెంటాడుతోంది. ఆటోమేటిగ్గా యూజర్లకు క్రెడిట్ అయ్య ఈ పక్రయలో ఇప్పుడు యూజర్లకు కనెక్ట్ కావడం లేదు. అంటే ఈ రెన్యూవల్‌ ప్రక్రియ ఆటోమేటిక్‌గా యూజర్లకు క్రెడిట్‌ అవడం లేదు. మరి ఇది ఎందుకు కావడం లేదో అనేది యూజర్లకు అర్థం కావడం కాక అయోమయంలో ఉన్నారు. అలాంటి వారుఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనం ఉండవచ్చు.

జియో టీజర్‌లో చెప్పింది, కొత్తగా ఏం తీసుకొస్తోంది, ఓ స్మార్ట్ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత రెవెన్యూల విషయంలో ..

జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను మరో ఏడాది పాటు పొడిగించుకోవడానికి యూజర్‌ అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మైజియో యాప్‌లో ఒక మెసేజ్‌ వస్తోంది. కానీ చాలా మంది యూజర్లకు ఈ మెసేజ్‌ రావడం లేదని తెలుస్తోంది. దీంతో యూజర్లు ఈ ఉచిత రెవెన్యూల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడి, మరో ఏడాది పాటు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్‌ చేసుకునే మార్గమేమిటో ఓ సారి చూద్దాం...

రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను

మీరు రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన జియో యూజర్‌ అయినప్పటికీ ప్రైమ్‌ను పొడిగించుకోవడానికి మెసేజ్‌ రాకపోతే, ముందుగా జియో యాప్‌ను క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 నిమిషాల పాటు వీడియోలను స్ట్రీమ్‌ చేయాలి.

నెంబర్‌ను వాడుతూ లాగిన్‌ ..

ఆ తర్వాత మరోసారి జియో యాప్‌ను తిరిగి స్టార్ట్‌ చేయాలి. ఏ నెంబర్‌కు అయితే జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను వాడుతూ లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో జియో యాప్‌లో బ్యానర్‌ పేజీలో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రెన్యూవల్‌ ఆప్షన్‌ కనిపిస్తోంది.ఆ ఆప్షన్‌పై యూజర్లు అప్లయ్‌ చేసుకోవాలి.

స్టాండర్డ్‌ రెన్యూవల్‌ ప్రాసెస్‌ను

స్టాండర్డ్‌ రెన్యూవల్‌ ప్రాసెస్‌ను యూజర్లు ఫాలో అవ్వాలి. బ్యానర్‌లో గెట్‌ నౌ అనే బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బటన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్టు ఒక మెసేజ్‌ వస్తుంది.

రిజిస్ట్రర్‌ నెంబర్లు..

అదేవిధంగా రిజిస్ట్రర్‌ నెంబర్లు కూడా వస్తాయి. ఆ నెంబర్లలో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకున్న నెంబర్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ పూర్తైపోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime Renewal Option Not Visible In MyJio App? Try This More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot