31తో జియో ప్రైమ్ సభ్యత్వం క్లోజ్, అధినేత స్పందన ఏంటంటే ?

Written By:

దేశీయ టెలికాం రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే జియో సునామిలా దూసుకుపోయింది. ఉచిత ఆఫర్లతో దేశీయ టెలికాం దిగ్గజాలకు చుక్కలు చూపించింది. ఆరంభం నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడమే కాదు, 4జీ స్పీడ్‌తో మొబైల్‌ డేటాను అందించి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. జియో సేవలు ప్రారంభించిన మొదటి ఆరు నెలలు ఉచిత వాయిస్‌ కాల్స్‌తో పాటు, రోజుకు ఒక జీబీ చొప్పున ఉచిత డేటాను అందించింది. గతేడాది మార్చి 31 వరకూ ఈ ఆఫర్‌ కొనసాగింది. ఆ తర్వాత ఏడాది కాల పరిమితి గల జియో ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారికి రీఛార్జ్‌లను బట్టి కాల్స్‌, డేటా సేవలను అందిస్తోంది. అయితే అది ఈ నెల 31తో క్లోజ్ కానుంది. తర్వాత ఏంటనేది జియో యూజర్లుకి తెలియడం లేదు. కంపెనీ ఈ ఆఫర్ కంటిన్యూ చేస్తుందా లేక కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుందా అనే దాని మీద తర్జనభర్జనలు నడుస్తున్నాయి.

ఎదురులేని జియో, కుదేలయిన ఆర్‌కామ్, ట్రాయ్ న్యూ రిపోర్ట్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

180 రోజుల్లోనే 10 కోట్లమంది వినియోగదారులను..

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో 180 రోజుల్లోనే 10 కోట్లమంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఉచిత ఆఫర్ల తర్వాత జియో సేవలను పొందాలంటే రూ.99తో జియో ప్రైమ్‌ సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించింది.

రీఛార్జ్‌ ప్లాన్‌ విషయంలో

ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేక సదుపాయాలను అందజేసింది. ముఖ్యంగా రీఛార్జ్‌ ప్లాన్‌ విషయంలో ఉచిత వాయిస్‌కాల్స్‌, అదనపు డేటా సేవలను అందించింది. ఇతరులతో పోలిస్తే ప్రైమ్‌ సభ్యత్వం తీసుకున్న వారు అదనపు ప్రయోజనాలను పొందారు.

ఏడాది కాలపరిమితి గల జియో

ఏడాది కాలపరిమితి గల జియో ప్రైమ్‌ సభ్యత్వం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూ.99తో మళ్లీ ప్రైమ్‌ సభ్యత్వాన్ని కొనసాగిస్తుందా? సభ్యత్వ రుసుములో పెంపు ఉంటుందా? వంటి ప్రశ్నలు జియో వినియోగదారుల మదిని తొలిచేస్తున్నాయి. దీనిపై త్వరలోనే జియో నిర్ణయం తీసుకుంటుందని టెలికాం వర్గాలు భావిస్తున్నాయి.

 

 

జియో ప్రైమ్‌ సభ్యత్వం లేకపోయినా..

జియో ప్రైమ్‌ సభ్యత్వం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఆఫర్లు కొనసాగుతాయని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జియో ప్రతినిధులు చెబుతున్నారు. ఏవైనా మార్పులు ఉంటే వెంటనే తెలియజేస్తామని వారు అంటున్నారు.

రూ.99కే మరో ఏడాది..

అయితే జియో కంపెనీ, పార్టనర్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జియో ప్రైమ్‌ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందిస్తుందని చెబుతున్నారు.

ఎలాంటి సమాచారం లేనప్పటికీ..

ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, మార్చి చివరి వారంలో బిగ్‌ సర్‌ప్రైజే ఉండొచ్చని జియో వర్గాలంటున్నాయి. జియో ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే, తన ప్రైమ్‌ మెంబర్లకు ఎప్పడికప్పుడు కంపెనీ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్లనే ప్రవేశపెట్టిందని, కస్టమర్లను కాపాడుకోవడానికి ఈ సారి అలానే సర్‌ప్రైజ్‌ చేయొచ్చని జియో పార్టనర్లు, స్టోర్లు అభిప్రాయ వ్యక్తంచేస్తున్నాయి.

జియో యాప్స్‌ను వాడితే..

మరికొందరు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు పెంపు ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జియో మ్యూజిక్, సావన్‌

ఇదిలా ఉంటే దాదాపు 1 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాం నెలకొల్పే దిశగా జియో మ్యూజిక్, డిజిటల్‌ మ్యూజిక్‌ సేవల సంస్థ సావన్‌ చేతులు కలిపాయి. దేశీయంగా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్లో ఈ భాగస్వామ్యం జియో-సావన్‌ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు తోడ్పడగలదని రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ ..

ఈ డీల్‌కి సంబంధించి జియోమ్యూజిక్‌ విలువ 670 మిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందం ప్రకారం డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై రిలయన్స్‌ 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Prime Set to Expire on March 31, but No Clarity on What Will Happen Next More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot