ఉత్తరాఖండ్ సొరంగం ఆపరేషన్.. కేవలం 12 గంటల్లోనే టవర్‌లు ఏర్పాటుచేసిన జియో..!
దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలు చేసిన ప్రార్ధనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం కూలిపోయిన ఘటనలో (uttarakhand silkyara tunnel Rescue operation ) 41 మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. అప్పటి నుంచి సుమారు 17 రోజులుగా అందులో ఉండిపోయిన కార్మికులు ఎట్టకేలకు మంగళవారం రాత్రి బయటకు వచ్చారు.
ఈ నెల 12 నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేశాయి. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కీలక విభాగాలు రంగంలోకి దిగాయి. NDRF, SDRF, బీఆర్‌వో సహా డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగాలు సహా నేషనల్ హైవే ఆథారిటికి చెందిన కీలక బృందాలు నిర్విరామంగా కృషిచేయాయి.

కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు భూమికి సమాంతరంగా గొట్టపు మార్గం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అందుకు భారీ యంత్రాలను తీసుకొచ్చారు. అయితే చివర 12 మీటర్ల తవ్వాల్సి ఉండగా.. యంత్రం విరిగిపోయింది. దీంతో చివరగా ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. పని పూర్తిచేశారు. దీంతో ఎట్టకేలకు 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు బయటకు వచ్చారు.
కీలక సేవలు అందించిన జియో : ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో (Jio) కీలకంగా వ్యవహరించింది. సంఘటన ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ బలహీనంగా ఉండడంతో కమ్యూనికేషన్ కోసం తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో సిల్‌క్యారా సొరంగ ప్రాంతం సమీపంలో సరైన నెట్‌వర్క్ కవరేజీ ఉండేలా చూడాలని నెట్‌వర్కింగ్ సంస్థలకు అధికారులు కోరినట్లు సమాచారం.
అధికారుల విజ్ఞప్తితో రంగంలోని దిగిన రిలయన్స్ జియో బృందాలు.. ఆ ప్రాంతంలో టవర్‌లను ఏర్పాటు చేశాయి. ఆ ప్రాంతంలో టవర్ల ఏర్పాటుకు సరైన మౌలిక సదుపాయాలు లేకున్నా.. కేవలం 12 గంటల్లోనే ఆ ప్రాంతంలో టవర్‌లను ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.
కార్మికులను తీసుకొచ్చే ఆపరేషన్ కొనసాగుతుండగా.. మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఫలితంగా కిస్మస్ వరకు కార్మికులు బయటకు వచ్చే పరిస్థితి లేదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అందరిలో ఆందోళన వ్యక్తం అయింది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగాక.. పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 24 గంటల్లోపే 10 మీటర్ల మట్టిని తీశారు.
ఈ ఘటన ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో భారత్ వాయుసేన ముందే అప్రమత్తం అయింది. చినూక్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది. చార్ ధామ్ ఆల్ వెదర్ యాక్సెలిబిలిటీ ప్రాజెక్టులో భాగంగా సిల్‌క్యారా వద్ద టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌కు చెందిన నవయుగ సంస్థ నిర్మాణం చేపడుతోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








