సైలెంట్‌గా జియో మళ్లీ ధరను పెంచేసింది, వారంలో ఇది రెండో సారి !

ఒకప్పుడు ఉచిత ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించిన జియో.. ఇటీవల టారిఫ్‌ ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే.

By Hazarath
|

ఒకప్పుడు ఉచిత ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించిన జియో.. ఇటీవల టారిఫ్‌ ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం టారిఫ్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరోమారు టారిఫ్ ధరను పెంచింది. దీనిపై జియో నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినా ధర పెరుగుదల మాత్రం కనిపిస్తోంది.

 

జియో కొత్త ప్లాన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండిజియో కొత్త ప్లాన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

మరో రూ. 8 ..

మరో రూ. 8 ..

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం దీపావళి సందర్భంగా రూ.491 రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చిన జియో ఇప్పుడు దానిపై మరో రూ. 8 పెంచింది. దీంతో ఇకపై ఈ ప్యాక్ రూ.499కి అందుబాటులో ఉంటుంది.

రోజుకు 1 జీబీ డేటా చొప్పున 91 రోజులపాటు..

రోజుకు 1 జీబీ డేటా చొప్పున 91 రోజులపాటు..

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 91 రోజులపాటు హైస్పీడ్ 4జీ డేటాను అందుకోవచ్చు. ప్రస్తుతం జియో అందిస్తున్న ప్లాన్లలో ఎక్కువ కాలపరిమితి ఉన్న ప్యాక్ ఇదే.

అధికారికంగా ఎటువంటి ప్రకటన..

అధికారికంగా ఎటువంటి ప్రకటన..

టారిఫ్ ధరను రూ.8 పెంచిన జియో దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. జియో వెబ్‌సైట్‌లోనూ ధర పెంపునకు సంబంధించిన వివరాలు లేవు.

జియో యాప్‌లో మాత్రం..
 

జియో యాప్‌లో మాత్రం..

అయితే జియో యాప్‌లో మాత్రం రూ.491 బదులు రూ. 499 కనిపిస్తోంది.నేటి నుంచి ఈ టారిఫ్ అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.

జియో తన సేవలను ప్రారంభించినప్పుడు..

జియో తన సేవలను ప్రారంభించినప్పుడు..

గతేడాది జియో తన సేవలను ప్రారంభించినప్పుడు రూ.499 ప్లాన్‌పై రోజుకు 2జీబీ 4జీ డేటాను అందించేది. ఇక జియో ధనాధన్‌ ఆఫర్‌ ప్రకటించిప్పుడు మాత్రం రూ.509కి 2జీబీ డేటాను ఇవ్వడం ప్రారంభించింది.

జియో టారిఫ్‌ల్లో..

జియో టారిఫ్‌ల్లో..

భారీ మార్పులు, అన్నీ ప్రియమే! భారీ మార్పులు, అన్నీ ప్రియమే!

 

 

Best Mobiles in India

English summary
Jio Raises Price of Rs. 491 Plan to Rs. 499 in Less Than a Week of Launch Read more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X