దిగ్గజాలకు జియో మరో షాక్, వైఫైతో వాయిస్ కాల్స్

టెలికాం రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది.

|

టెలికాం రంగంలో రోజు రోజుకు సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయిన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు తిరుగులేని దెబ్బ కొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే వాయిస్ ఓవర్ వైఫై సేవలను అందించనున్నట్టు జియో ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇతర టెల్కోలతో పోటీ అనివార్యమైన నేపథ్యంలో జియో కొత్తగా ఏం తీసుకువస్తుందనే దాని మీద టెక్ విశ్లేషకులు తమ మొదడుకు పనిచెబుతున్నారు. కాగా మరికొద్ది సేపటిలో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 స్టార్ట్ కానుంది.

 

పోర్న్ దెబ్బ, సోషల్ మీడియాపై పన్ను, దేశ వ్యాప్తంగా నిరసన సెగలుపోర్న్ దెబ్బ, సోషల్ మీడియాపై పన్ను, దేశ వ్యాప్తంగా నిరసన సెగలు

వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల

వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల

వాయిస్ ఓవర్ వైఫై సేవల వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న, సరిగా అందని ప్రాంతాల్లోని వినియోగదారులకు కాల్ డ్రాప్స్ బెడద ఉండదు. 

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ..

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ..

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. ఈ సేవల కోసం జియో తన 4జీ ఫీచర్ ఫోన్లలు అవసరమైన మార్పులు చేస్తున్నట్టు జియో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

 4జీ ఫీచర్ ఫోన్లతో

4జీ ఫీచర్ ఫోన్లతో

జియో ప్రవేశపెట్టి 4జీ ఫీచర్ ఫోన్లతో ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక 50 కోట్లమంది జియో ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018
 

రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018

రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 మీటింగ్ ఈ రోజు జరగననున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలను అధినేత ముకేష్ అంబానీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అవేంటో ఓ సారి చూద్దాం.

గత 12 నెలల కాలంలో

గత 12 నెలల కాలంలో

గత 12 నెలల కాలంలో జియో నెట్ వర్క్ కెపాసిటి రెండింతలు పెరిగింది. జియో యూజర్లు రొజుకు యావరేజ్ గా 290 నిమిషాలు జియో నెట్ వర్క్ వాడుతున్నారని అధినేత ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది.

215 మిలియన్ కస్టమర్లను..

215 మిలియన్ కస్టమర్లను..

జియోకి ఇప్పటివరకు 215 మిలియన్ కస్టమర్లను కలిగిఉంది. 22 నెలల కాలంలోనే ఈ మైలురాయిని చేరుకున్నామని ప్రకటించే అవకాశం ఉంది.

డేటా

డేటా

డేటా విషయంలో జియో చాలా స్పీడుగా ముందుకెళుతోంది. జియో డేటా వాడకం 125 కోట్ల జిబి నుండి 205 కోట్ల జిబికు పెరిగింది.

జియో ఫోన్

జియో ఫోన్

జియో ఫోన్ ను ఇప్పటిదాకా 25 మిలియన్ల మందికి పైగానే చేజిక్కించుకున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ లెవల్ గురించి ఇకపై మా చర్చలు సాగుతాయని ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

స్పష్టమైన ప్రకటన..

స్పష్టమైన ప్రకటన..

అలాగే broadband space, JioFiber launch మీద కూడా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఇది యూజర్లను ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మరికొద్ది సేపట్లో..

మరికొద్ది సేపట్లో..

కాగా మరికొద్ది సేపట్లో రిలయన్స్ ఇండస్ట్రీ AGM 2018 సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో జియో ఏ సంచలనాలను బయటకు తీసుకువస్తోందనని యూజర్లు అంతా ఎదురుచూస్తున్నారు.

Best Mobiles in India

English summary
Reliance Jio Infocomm appears to be stealing a march over rivals Bharti Airtel and Vodafone on voice over WiFi. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X