రూ.500 ధరలో రోజువారీ 2GB డేటాను అందించే జియో రీఛార్జ్ ప్లా్న్‌లు..!
Jio 2GB Data Plans : జియో ప్రస్తుతం దేశ టెలికాం రంగంలో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. సుమారు 50 కోట్లకు పైగా యూజర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రోజువారీ 2GB డేటాను అందించే అనేక రీఛార్జ్ ప్లాన్‌లను జియో కలిగి ఉంది.
* రూ.198 రీఛార్జ్ ప్లాన్ :
రోజువారీ 2GB డేటాను (Jio Rs198 Recharge Plan) అందించే జియో కనిష్ఠ రీఛార్జ్ ప్లాన్ ఇదే. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు.

5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. దీంతోపాటు జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్‌లను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
* రూ.349 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs349 Recharge Plan) యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు. క్లౌడ్ యాప్ ద్వారా 50GB స్టోరేజీని పొందవచ్చు.
* రూ.449 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs449 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.
జియోహాట్‌స్టా్ర్ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు Sony LIV, Zee5, డిస్కవరీ+, Sun NXT సహా మరిన్ని ఓటీటీ ప్లాన్‌లను అందిస్తోంది. గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్ ద్వారా 50GB స్టోరేజీ ని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియో ఫైనాన్స్ సహా మరిన్ని ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది.
* రూ.500 రీఛార్జ్ ప్లాన్ :
కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈ ప్లాన్‌ను (Jio Rs500 Recharge Plan) ఇటీవలే జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్ ద్వారా 50GB డేటాను స్టోరేజీ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, Zee5, Sun NXT, డిస్కవరీ+, ఫ్యాన్ కోడ్ సహా మరిన్ని సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








