Home
News

జియో రూ.999 ప్లాన్ ద్వారా 98 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా.. పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం సంస్థ జియో ఈ నెల 3 వ తేదీ నుంచి కొత్త మొబైల్‌ టారిఫ్‌లను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే తన అన్ని ప్లాన్‌లతోపాటు రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రూ.1199 గా మార్చింది. అయితే ఈ ప్లాన్‌ను తిరిగి రూ.999 గా మారుస్తూ జియో (Jio RS999 prepaid Plan) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్లాన్‌ అందిస్తున్న ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. ఈ ప్లాన్ ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. పూర్తి వివరాలు.

ఈ రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో జియో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉండగా.. తాజాగా 98 రోజులకు పెరిగింది. గతంలో ఈ ప్లాన్‌ ద్వారా రోజువారీ 3GB డేటా లభించగా.. తాజాగా రోజుకు 2GB డేటాను అందిస్తోంది.

jio again launched rs999 plan

దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్‌ మరియు 5G నెట్‌వర్క్ అందుబాటులోకి ఉన్న వినియోగదారులు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, డేటా కావాల్సిన వారికోసం ఈ ప్లాన్‌ సౌకర్యంగా ఉంటుంది.

అయితే జియోకు చెక్ పెట్టేందుకు మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారి 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీంతోపాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ను పొందవచ్చు. ఈ ఓటీటీ వ్యాలిడిటీ 56 రోజులపాటు ఉంది.

జియో రూ.479 ప్లాన్‌ ద్వారా 6GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌, SMS ప్రయోజనాలున్నాయి. 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. అదే రూ.799 ప్లాన్‌ ద్వారా రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMS లను పొందవచ్చు.

రూ.859 ప్లాన్ ద్వారా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.1899 ప్లాన్‌ ద్వారా 336 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, SMS, 24GB డేటాను పొందవచ్చు. మరియు రూ.3599 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. మరియు SMS, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio relaunched rs999 prepaid plan again with extra validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X