జియో ఫోన్ యూజర్ల కోసం కొత్తగా మరో ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్!! ప్రత్యేకత ఏమిటో తెలుసా

|

ఇండియాలోని టెలికాం రంగంలో వినూత్న మార్పులకు మొదట శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో సరసమైన ధరల వద్ద వినియోగదారులకు డేటా మరియు అన్ లిమిటెడ్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. తరువాత 2G సిమ్ లను వాడుతున్న వారిని అప్ గ్రేడ్ చేయడం కోసం తక్కువ ధరలోనే 4G సపోర్ట్ చేసే జియో ఫోన్ ను విడుదల చేసింది. అయితే ఈ జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్లాన్ లను విడుదల చేసింది. అందులో భాగంగా రిలయన్స్ జియో ఇప్పుడు కొత్తగా మరొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

 

మైజియో

జియో టెలికాం దిగ్గజం ప్రస్తుతం అందిస్తున్న చౌకైన ప్లాన్ రూ.75 ధర వద్ద లభించే రీఛార్జ్ ప్లాన్. జియోఫోన్ నెక్స్ట్ ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో తన రూ.39 మరియు రూ.69 ప్లాన్ లను నిలిపివేసిన తర్వాత ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ రెండు ప్లాన్‌లు ఇకపై జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో జాబితా చేయబడవు. ఏదేమైనా జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం నవంబర్ 4న 2021 దీపావళి సందర్భంగా లాంచ్ కానున్నది.

జియోఫోన్ రూ.75 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

జియోఫోన్ రూ.75 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

జియో ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ప్రకటించిన రూ.75 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్‌లను అందిస్తుంది మరియు 200MB బూస్టర్‌తో నెలకు 3GB 4G డేటాతో మరియు రోజుకు 50 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది JioTV, JioCinema, JioNews, JioSecurity మరియు JioCloud వంటి అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. రూ.39 మరియు రూ.69 ప్లాన్ లు నిలిపివేసిన తరువాత రూ.75 కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు జియో వెబ్‌సైట్ మరియు మైజియో యాప్‌లో జాబితా చేయబడిన చౌకైన ప్లాన్ కావడం విశేషం.

జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ ఆలస్యానికి కారణం
 

జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ ఆలస్యానికి కారణం

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఆలస్యానికి సంబంధించి రిలయన్స్ జియో కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ట్రయల్స్‌లో ఉన్నట్లు చెప్పబడింది మరియు దీపావళికి సకాలంలో సిద్ధంగా ఉంటుంది. ఈ 4G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో నవంబర్ 4, 2021 న లాంచ్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. జియోఫోన్ నెక్స్ట్ ధర మరియు డెలివరీ ప్లాన్‌ల ప్రకటనలో జాప్యం గ్లోబల్ చిప్ కొరతతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది.

జియోఫోన్ నెక్స్ట్ ముఖ్యమైన ఫీచర్లు

జియోఫోన్ నెక్స్ట్ ముఖ్యమైన ఫీచర్లు

రూ.5,000 ధర వద్ద లభించే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ గేమ్-ఛేంజర్ కావచ్చు. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండస్ట్రీని షేక్చేసే అవకాశం ఎంతగానో ఉంది. అలాగే ఇతర కంపెనీలు మెరుగైన స్పెసిఫికేషన్స్ మరియు సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో అదే రేంజ్‌లోని డివైజ్‌లతో బయటకు వచ్చేలా చేస్తుంది. ఒకవేళ జియో దీన్ని అందించడంలో విఫలమైతే కనుక కంపెనీ వాగ్దానాలపై ఇది బాగా కనిపించదు. అంతేకాకుండా తదుపరి దాని చందాదారుల బేస్‌పై కూడా నిజంగా ప్రభావం చూపదు. చాలా మంది వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హాట్‌స్పాట్‌లు లేదా వాయిస్ కాల్‌ల కోసం ద్వితీయ పరికరంగా కూడా ఉపయోగించవచ్చు.స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. బడ్జెట్ విభాగంలో లభించే ఫోన్ లో కెమెరా చాలా బాగుంటుందని మరియు ఫోన్ సిల్కీ స్మూత్‌గా ఉంటుందని ఎవరూ ఊహించరు. ఇది మంచి పనితీరును కనబరిచి మరియు వాట్సాప్ వంటి మరిన్ని యాప్‌లకు బలమైన మద్దతుతో పాటు వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయడానికి వినియోగదారులను అనుమతించినట్లయితే అది బాగానే ఉంటుంది.

JioBook ల్యాప్‌టాప్

JioBook ల్యాప్‌టాప్

JioBook ల్యాప్‌టాప్ ఇండియా లాంచ్ త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు. జియో యొక్క ఈ కొత్త ప్రొడెక్టు ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. Jio నుంచి రాబోయే ఈ ల్యాప్‌టాప్ యొక్క మూడు వేరియంట్లు సర్టిఫికేషన్ సైట్‌లో జాబితా చేయబడ్డాయి. అంతర్గత మోడల్ హోదాలు కాకుండా నోట్‌బుక్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే మునుపటి నివేదికలు JioBook 4G LTE కనెక్టివిటీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4GB LPDDR4x ర్యామ్ మరియు 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రావచ్చని సూచిస్తున్నాయి. ఆన్ లైన్ లో వచ్చిన కొన్ని లీక్ ల ప్రకారం జియోబుక్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) ద్వారా గుర్తించబడింది. జియో ల్యాప్‌టాప్ NB1118QMW, NB1148QMW, మరియు NB1112MM వంటి మూడు ఇంటర్నల్ మోడల్ హోదాలను కలిగి ఉంది. రిలయన్స్ జియో ల్యాప్‌టాప్ మూడు విభిన్న వేరియంట్లలో రావచ్చునని ఇది సూచిస్తుంది.

Best Mobiles in India

English summary
Jio Released Another New Prepaid Plan For Jio Phone Users!! Do You Know What The Specialty

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X