మరో సంచలనానికి తెరలేపుతున్న ముఖేష్ అంబానీ

ఉచిత వాయిస్‌ కాలింగ్‌, తక్కువకే ఎక్కువ డేటా అంటూ ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రిలయన్స్‌ జియో, మరో సంచలనానికి సిద్ధమవుతోంది.

|

ఉచిత వాయిస్‌ కాలింగ్‌, తక్కువకే ఎక్కువ డేటా అంటూ ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రిలయన్స్‌ జియో, మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జియో అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటెయిల్ అతి త్వరలోనే మరో కొత్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టబోతోందని తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా వినియోగదారులకు, రీటెయిల్స్ కు, ప్రొడ్యూసర్ కు అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా దేశంలో ఉన్న 3 కోట్ల మంది చిన్న వ్యాపారులకు మేలు జరగనుందని ఆయన తెలిపారు. కలకత్తాలో జరిగిన 5వ బెంగాల్ బిజినెస్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ ఈ విషయాలను తెలిపారు.

లింక్ క్లిక్ చేయగానే రూ.60,000 గోవిందాలింక్ క్లిక్ చేయగానే రూ.60,000 గోవిందా

మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్

మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్

రిలయన్స్ జియోకు బెంగాల్ లో మొత్తం లక్ష మంది యాక్టివ్ బిజినెస్ పార్టనర్స్ ఉన్నారని, అయితే దీన్ని మరింతగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. బెంగాల్ లో ఉన్న ప్రతి చిన్న గ్రామానికి కూడా జియో సేవలు అందే విధంగా కంపెనీ ముందుకువెళుతోందని తెలిపారు

రూ. 28 వేల కోట్ల పెట్టుబడులు

రూ. 28 వేల కోట్ల పెట్టుబడులు

ఇండియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానికి చెందిన రిల్ వెస్డ్ బెంగాల్లో ఇప్పటికే రూ. 28 వేల కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఇండియాలో ఇలా పెట్టుబ పెట్టిన కంపెనీల్లో జియో పదవది. డిజిటల్ రివల్యూషన్ లో భాగంగా రూ.10 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు జియో ప్లాన్ చేస్తోంది.

ప్రతి ఇంటిని స్మార్ట్ హోమ్ గా..

ప్రతి ఇంటిని స్మార్ట్ హోమ్ గా..

ఆప్టిక్ పైబర్ ద్వారా బెంగాల్ మొత్తం డిజిటల్ సర్వీసులను అందిస్తామని ప్రతి ఇంటిని స్మార్ట్ హోమ్ గా మారుస్తామని అంబాని తెలిపారు. రిలయన్స్ రిటెయిల్ ప్రస్తుతం బెంగాల్ లో 500 రీటెయిల్ స్టోర్స్ ని అలాగే 46 పెట్రో రీటెయిల్ అవుట్ లెట్స్ ఉన్నాయి. ఇవి 400 సిటీల్లో దాదాపు 1 మిల్లియన్ చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి.

2019 నాటికి

2019 నాటికి

100 శాతం జనాభా 2019 నాటికి జియో నెట్ వర్క్ కి చేరుకుంటారని ఆ దశలో రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ మొత్తం జియోమయం కావాలని ఆయన తెలిపారు.

ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి

ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి

కాగా రిలయన్స్ జియో తనకున్న విస్తారమైన నెట్‌వర్క్‌, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లతో ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ వీధుల్లో ఉండే స్టోర్లు లేదా కిరణా షాపులతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది.

డిజిటల్‌ కూపన్లను

డిజిటల్‌ కూపన్లను

జియో మనీ ప్లాట్‌ఫామ్‌ లేదా టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా డిజిటల్‌ కూపన్లను వాడుకుని పక్కనే ఉన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేలా ఆపరేషనల్‌ మోడల్‌ను సిద్ధంచేస్తుందని తెలిసింది. ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ సిటీల్లో పలు స్టోర్లకు, దిగ్గజ బ్రాండులకు కల్పిస్తోంది. వచ్చే ఏడాది దేశమంతటా దీన్ని ఆవిష్కరించనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి

Best Mobiles in India

English summary
Jio, Reliance Retail will shortly launch a unique New Commerce platform: Mukesh Ambani More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X