జియో కస్టమర్లకు ఇక పండగే, ప్లాన్‌ల పై రూ.50 తగ్గింపు

Posted By: BOMMU SIVANJANEYULU

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ క్రింద ఇటీవల రెండు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన రిలయన్స్ జియో, తాజాగా తాను అందిస్తోన్న 1జీబి ప్రీ-పెయిడ్ ప్లాన్‌లకు సంబంధించి రేట్లను తగ్గించింది. ధర తగ్గింపు నేపథ్యంలో రూ.199 ప్లాన్‌ను రూ.149కి, రూ.399 ప్లాన్‌ను రూ.349కి, రూ.459 ప్లాన్‌ను రూ.399కి, రూ.499 ప్లాన్‌ను రూ.449కి సొంతం చేసుకోవచ్చు. అప్‌డేట్ కాబడిన టారిఫ్ ప్లాన్స్ జనవరి 9 నుంచి అమల్లోకి వస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

149 రోజుల ప్లాన్‌తో 28 రోజుల పాటు రోజుకు 1జీబి డేటా..

ఈ ప్లాన్‌లకు సంబంధించి డేటా అలానే వ్యాలిడిటీ బెనిఫిట్లను పరిశీలించినట్లయితే.. రూ.149 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే యూజర్లకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీబి డేటా అందుబాటులో ఉంటంది. రూ.349 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే యూజర్లకు 70 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీబి డేటా అందుబాటులో ఉంటంది.

రూ.399 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే యూజర్లకు 84 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీబి డేటా అందుబాటులో ఉంటంది. రూ.499 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే యూజర్లకు 91 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీబి డేటా అందుబాటులో ఉంటంది.

50 శాతం వరకు అదనపు డేటా..

మరో ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో ఇప్పటికే అందుబాటులో ఉంచిన పలు ప్లాన్‌ల పై అదే రేటుకు 50 శాతం వరకు అదనపు డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్‌లకు సంబంధించి డేటా అలానే వ్యాలిడిటీ బెనిఫిట్లను పరిశీలించినట్లయితే.. రూ.198 ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవటం ద్వారా యూజర్లకు 28 రోజుల పాటు రోజుకు 1.5జీబి డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్ పై 28జీబి డేటా మాత్రమే లభించేది. ఇప్పుడు 42జీబి డేటా లభిస్తోంది.

ఎయిర్‌టెల్ ఆఫర్‌తో రూ.3000కే 4జీ స్మార్ట్‌ఫోన్

గతంలో 1జీబి, ఇప్పుడు 1.5జీబి

రూ.398 ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవటం ద్వారా యూజర్లకు 70 రోజుల పాటు రోజుకు 1.5జీబి డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్ పై 70జీబి డేటా మాత్రమే లభించేది. ఇప్పుడు 105 జీబిల డేటా లభిస్తోంది. రూ.448 ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవటం ద్వారా యూజర్లకు 84 రోజుల పాటు రోజుకు 1.5జీబి డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్ పై 84జీబి డేటా మాత్రమే లభించేది. ఇప్పుడు 126 జీబిల డేటా లభిస్తోంది. రూ.498 ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవటం ద్వారా యూజర్లకు 91 రోజుల పాటు రోజుకు 1.5జీబి డేటా లభిస్తుంది. గతంలో ఈ ప్లాన్ పై 91జీబి డేటా మాత్రమే లభించేది. ఇప్పుడు 136 జీబిల డేటా లభిస్తోంది.

రూ.299 ప్లాన్‌తో రోజుకు 2జీబి డేటా..

మరొక ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.299 ప్లాన్‌కు సబ్‌స్ర్కైబ్ అవ్వటం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. మరోవైపు క్రిస్మిస్, న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని జియో అనౌన్స్ చేసిన సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను జనవరి 15తో ముగియబోతున్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.399 ఆపై రీఛార్జ్ పై రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio, as part of its 'Happy New Year' offer, has announced 1GB per day data usage at a recharge of Rs 149, which is Rs 50 lower than its earlier plan. The company said all existing 1GB packs would be enhanced with two additional options - 50 per cent more data or Rs 50 discount on the price plans
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot