మళ్ళీ ఆ రెండింటికి ఝలక్, 2 రోజులకే జియో ప్లాన్లలో మార్పు, జోరులో అధినేత !

Written By:

దేశీయ టెలికారం రంగంలో దూసుకుపోతున్న జియో తన ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువ డేటా తక్కువ ధర అన్న చందంగా ఈ ప్లాన్లను రివైజ్ చేసింది. అయితే జియో అలా తన ప్లాన్లను రివైజ్ చేసిందో లేదో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్లు తమ ప్లాన్లను అప్‌గ్రేడ్ చేశాయి..అయితే జియో మళ్లీ తన ప్లాన్లలో మార్పు చేసి వాటికి షాకిచ్చింది. జియో కొత్తగా మార్పు చేసిన ప్లాన్లపై ఓ లుక్కేయండి.

జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.509 ప్లాన్‌

ఈ ప్లాన్లో ఇప్పుడు రోజుకు 3జిబి డేటాను 28 రోజులు పాటు అందించనుంది. మొత్తంగా 84జీబీ డేటాను ఆఫర్‌ చేయబోతుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 2జీబీ డేటాను, 49 రోజుల పాటు అందించింది. అలాగే కాల్స్ అన్‌లిమిటెడ్.

రూ.799 ప్లాన్‌

ఈ ప్లాన్లో ఇప్పుడు రోజుకు 5జిబి 4జి డేటాను 28 రోజులు పాటు అందించనుంది. మొత్తంగా 140 జీబీ డేటాను ఆఫర్‌ చేయబోతుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 3జీబీ డేటాను, 49 రోజుల పాటు అందించింది. అలాగే కాల్స్ అన్‌లిమిటెడ్.

ఎయిర్‌టెల్‌ ..

కాగా జియో తన ప్రీపెయిడ్‌ ప్యాక్‌లపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన అనంతరం, ఎయిర్‌టెల్‌ తన ప్లాన్లను సమీక్షించింది. వొడాఫోన్‌ కూడా రూ.456 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది.

అప్ గ్రేడ్ చేశాయో లేదో..

అయితే ఈ రెండు దిగ్గజాలు తమ ప్లాన్లను అలా అప్ గ్రేడ్ చేశాయో లేదో మళ్లీ జియో వాటికి కౌంటర్ గా తన ప్లాన్లను సమీక్షించడం గమనార్హం..

మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !

జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే ! మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio revises Rs. 509, Rs. 799 plans to offer more data to take on Airtel and Vodafone More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot