జియో రీఛార్జ్ ఆఫర్ అదిరింది భయ్యా.. మళ్లీ రూ.189 ప్లాన్ తీసుకొచ్చేసిందిగా.. అదిరిపోయే బెనిఫిట్స్..
Jio Affordable Value Pack: రిలయన్స్ జియో మొబైల్ వాడుతున్నోళ్లకి గుడ్ న్యూస్. జియో సంస్థ చాలామంది యూజర్లకు ఎంతో ఫేవరెట్ అయిన రూ.189 ప్లాన్‌ని మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. "వాల్యూ" కేటగిరీలో దీనిని జోడించింది. మొన్నమధ్య ఈ 189 ప్లానే పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇప్పుడేమో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ "వాల్యూ" సెక్షన్‌లో రెండు ప్లాన్లు ఉన్నాయి. అవి కూడా వాయిస్ కాల్స్ ఎక్కువ వాడేవాళ్ల కోసమే. ఒకటి రూ.448, ఇంకోటి రూ.1748.
వీటితో పాటు, జియో కొత్తగా "అఫోర్డబుల్ ప్యాక్స్" అని ఒక కొత్త సెక్షన్ పెట్టింది. ఈ సెక్షన్‌లోనే రూ.189 ప్లాన్ యాడ్ అయింది. ఈ ప్లాన్ కొత్తదేం కాదు. ఇదివరకు ఉండేది, కానీ 2024, జులైలో రేట్లు పెంచినప్పుడు దీన్ని సైలెంట్‌గా తీసేశారు. అప్పుడు దీని రేటు రూ.155 ఉండేది. దాన్నే కొంచెం రేటు పెంచారు.

2025, జనవరి 30న ఈ ప్లాన్ లేదని వార్తలు కూడా వచ్చాయి. అది నిజమే కానీ ఇప్పుడు అది మళ్లీ అదిరిపోయే బెనిఫిట్స్‌తో వచ్చేసింది. పేరుకు తగినట్లే ఇది వాల్యూ రీఛార్జ్ ప్లాన్‌గా నిలుస్తోంది. దీనికి రీఛార్జ్ చేసుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మొబైల్ బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
* రూ.189 ప్లాన్
ఈ ప్లాన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 28 రోజుల వ్యాలిడిటీ. మొత్తం 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎవరికైనా ఎంతసేపైనా మాట్లాడొచ్చు. 300 SMS మెసేజ్‌లు కూడా ఫ్రీ. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ ఫ్రీగా వాడుకోవచ్చు.
ఒకవేళ 2GB డేటా అయిపోతే, స్పీడ్ కొంచెం తగ్గిపోతుంది. 64 Kbps స్పీడ్‌తో నెట్టుకొచ్చేయొచ్చు. లేదంటే ఏదైనా డేటా రీఛార్జ్ చేసుకోవచ్చు తద్వారా ఇంటర్నెట్ అవసరాలను తీర్చుకోవచ్చు స్పెషల్ మీడియాను యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుత జియోలో ఇదే చీపెస్ట్ ప్లాన్ కాగా కానీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదే రూ.199 ప్లాన్.
* రూ.199 ప్లాన్ vs రూ.189 ప్లాన్ - ఏది బెస్ట్..
రూ.199 ప్లాన్‌లో రోజుకి 1.5GB డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 18 రోజులు. రూ.189 ప్లాన్‌తో పోలిస్తే తక్కువ. రోజుకి 100 SMSలు, అంటే ఎక్కువ మెసేజ్‌లు పంపొచ్చు. రూ.199 ప్లాన్‌లో డేటా ఎక్కువ ఉన్నా, వ్యాలిడిటీ మాత్రం తక్కువ. రెండిట్లోనూ 5G అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ లేదు.
* ఇంకా వాల్యూ ప్లాన్స్ వస్తాయా..
భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ రూ.548 ప్లాన్ లాగా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ జియో కూడా తెస్తుందా లేదా అనేది చూడాలి. టెలికాం కంపెనీలు మాత్రం ప్లాన్స్‌లో చాలా మార్పులు చేస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్‌టెల్ కూడా త్వరలో కొత్త ప్లాన్స్‌తో వచ్చే ఛాన్స్ ఉంది.
రూ.189 ప్లాన్‌ని మళ్లీ తీసుకురాకముందు, జియో ఈ ప్లాన్‌తో పాటు రూ.479 ప్లాన్‌ని తీసేసింది. రూ.479 ప్లాన్ ఇప్పుడు అందుబాటులో లేదు కానీ ఇది 84 రోజుల వ్యాలిడిటీ, 6GB ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 SMSలు వంటి బెనిఫిట్స్ అందించేది. ఈ ప్లాన్ తక్కువ డేటా వాడేవాళ్లకి, ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునేవాళ్లకి మంచి ఆప్షన్.
ట్రాయ్ (TRAI) రూల్స్ ప్రకారం, టెలికాం కంపెనీలు వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్స్‌ని తీసుకురావాలి. అందుకే జియో ఈ కొత్త ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. డేటా ఎక్కువ అవసరం లేని వాళ్లకి, తక్కువ రేటులో కాలింగ్, SMS ప్లాన్స్ కావాలనుకునే వాళ్లకి ఇవి బాగా యూజ్ అవుతాయి.


Click it and Unblock the Notifications








