జియో యూజర్లకు మరో కానుక, దీపావళి ధనాధన్‌ ఆఫర్‌

Written By:

దీపావళి సందర్భంగా యూజర్లకోసం జియో మరో ఆఫరును ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా జియో దీపావళి ధనాధన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్‌ను తదుపరి రీచార్జ్‌ చేసుకునే సమయంలో వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

చరిత్ర పుటల్లోకి టాటా టెలికం, 5000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 399తో రీచార్జ్‌ ..

రూ. 399తో రీచార్జ్‌ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

పాత ప్యాక్‌ పూర్తైన తర్వాత..

ప్రస్తుతం ఏదో ఒక ప్యాక్‌లో ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్‌ రీచార్జ్‌ను చేసుకోవడం వల్ల పాత ప్యాక్‌ పూర్తైన తర్వాత ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.

వోచర్ల రూపంలో క్యాష్‌బ్యాక్‌

రూ.399తో రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారలకు వోచర్ల రూపంలో క్యాష్‌బ్యాక్‌ అందుతుందని చెప్పింది. ఇప్పటికే జియో ప్రైమ్‌ కస్టమర్లుగా ఉన్న వారికి ఎనిమిది వోచర్లు(రూ.50) క్యాష్‌బ్యాక్‌ రూపంలో వస్తాయని చెప్పింది.

ఈ నెల 12 నుంచి 18 వరకూ

ఈ నెల 12 నుంచి 18 వరకూ ఆఫర్‌ అమలులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఎక్కువ విలువజేసే ఆఫర్లను కొనుగోలు చేసుకునేందుకు..

వీటిని రూ. 309 లేదా అంతకంటే ఎక్కువ విలువజేసే ఆఫర్లను కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు లేదా రూ.91 ఆపై విలువజేసే డేటా ఆడ్‌ ఆన్స్‌ను కొనుగోలు చేయొచ్చు.

నవంబర్‌ 15 తర్వాతే ..

అయితే, క్యాష్‌బ్యాక్‌ వచ్చిన మొత్తాన్ని నవంబర్‌ 15 తర్వాతే వినియోగించడానికి వీలు కలుగుతుంది.

రూ.399 ప్యాక్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు ఒకే రకమైన సదుపాయాలను ఈ ప్యాక్‌ కల్పిస్తుంది.
84 జీడీ డేటా(84 రోజులు)
ఫ్రీ ఎస్‌ఎంఎస్‌, కాల్స్‌
సబ్‌క్రిప్షన్‌ టూ జియో యాప్స్‌
84 రోజుల వ్యాలిడిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Rs. 399 Pack Now With 100 Percent Cashback: Details and All the Fineprint Read more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot