Home
News

జియో యూజర్లకు పండగే.. రూ.11 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 10GB డేటాను పొందవచ్చు..!

జియో ప్రస్తుతం భారత్‌ టెలికాం రంగంలో యూజర్ల పరంగా తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా (VI), BSNL ఉన్నాయి. భారీగా ఉన్న యాజర్ల అవసరాలకు అనుగుణంగా జియో వివిధ రీఛార్జ్ ప్లాన్‌ లను అందుబాటులో ఉంచింది. యూజర్ల డేటా అవసరాలు తీర్చేలా జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ను (Jio New Recharge Plan) లాంచ్‌ చేసింది. దీని ద్వారా అదనపు డేటాను పొందవచ్చు.

జియో తాజాగా రూ.11 డేటా రీఛార్జ్‌ ప్లాన్‌ ను (jio RS11 Recharge Plan) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏకంగా 10GB హై‌స్పీడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా ఎటువంటి కాలింగ్‌, SMS సదుపాయం అందుబాటులో ఉండదు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటి గంటపాటు మాత్రమే ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరం ఉన్న వారికి ఈ ప్లాన్‌ సౌకర్యంగా ఉంటుంది.

Jio RS11 Recharge plan offers 10GB data

జియో రూ.11 రీఛార్జ్‌ ప్లాన్‌ లో మరో రెండు ఆసక్తికర అంశాలున్నాయి. ఈ ప్లాన్‌ను ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు యాక్టివ్‌ బేసిక్‌ ప్లాన్ లేకున్నా... రూ.11 తో రీఛార్జ్‌ చేసుకొని.. 10GB డేటాను పొందవచ్చు. మై జియో యాప్‌ సహా జియో వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చని జియో వెల్లడించింది.

ప్రస్తుతం జియోలో అనేక డేటా వోచర్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ.19 రీఛార్జ్‌తో 1GB డేటాను ఒకరోజు వ్యాలిడిటీతో వినియోగించుకోవచ్చు. రూ.49 ప్లాన్‌లో భాగంగా ఒక్కరోజుపాటు అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు. రూ.139 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 12GB డేటాను పొందవచ్చు.

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లతోపాటు రూ.179 డేటా వోచర్‌ ద్వారా 10GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 10 OTT యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా కాలింగ్, SMS సదుపాయం అందుబాటులో ఉంది.

అలాగే రూ.219 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 30GB హై స్పీడ్‌ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. మరియు రూ.359 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 50GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అయితే రెండు ప్లాన్‌లో డేటా మినహా ఇతర ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు.

ఎయిర్‌టెల్‌ కూడా ఇదే తరహా రీఛార్జ్‌ ప్లాన్‌ను కలిగి ఉంది. ఎయిర్‌టెల్‌ రూ.11 డేటా రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 10GB డేటాను పొందవచ్చు. గంట వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అయితే వోడాఫోన్‌ ఐడియా సంస్థ మాత్రం రూ.23 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 1 GB డేటాను పొందవచ్చు. ఒక్కరోజు వ్యాలిడిటిని అందిస్తోంది.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కూడా ఇదే తరహా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. యూజర్లు రూ.16 రీఛార్జ్‌ చేయడం ద్వారా 2GB డేటా ను పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక్కరోజు వ్యాలిడిటీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio RS11 Recharge plan offers 10GB data and here is the validity details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X