జియో రీఛార్జ్ ప్లాన్.. 500GB డేటా, 200 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు..!
జియో అనేక ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. యూజర్ల కాలింగ్, డేటా సహా ఇతర అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో రోజువారీ 2.5GB డేటాను అందించే మూడు ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ.2025, రూ.3599, రూ.3999 రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. ఈ ప్లాన్ ల పూర్తి ప్రయోజనాల వివరాలు.
* జియో రూ.2025 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా జియో ప్రీపెయిడ్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు.

5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ సదుపాయం కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 200 రోజులుగా ఉంటుంది. మొత్తంగా 500GB 4G డేటాను పొందవచ్చు. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ లో (Jio Rs2025 Prepaid Recharge Plan) భాగంగా యూజర్లు జియోటీవీతోపాటు జియో ఏఐ క్లౌడ్ యాప్స్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జియోఏఐ క్లౌడ్ ద్వారా 50GB స్టోరేజీని పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది.
* రూ.3599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో (Jio Rs3599 Prepaid Recharge Plan) యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2.5GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు డేటా పరంగా 5G నెట్‌వర్క్, 5G ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 912.5GB 4G డేటాను జియో యూజర్లు ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. మరియు జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు. జియో ఏఐక్లౌడ్ 50GB స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది.
* రూ.3999 రీఛార్జ్ ప్లాన్ :
ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో ( Jio Rs3999 Prepaid Recharge Plan ) యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ప్రతి రోజు 2.5GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు డేటా పరంగా 5G నెట్‌వర్క్, 5G ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 912.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో భాగంగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. మరియు జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్‌లను వినియోగించుకోవచ్చు. జియో ఏఐక్లౌడ్ 50GB స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








