కోట్ల మంది యూజర్లకు జియో కళ్లు చెదిరే ఆఫర్.. 2026, మార్చి వరకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2.5GB డేటా!
Jio Recharge Plan : భారతదేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో కోట్ల మంది కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. అదే రూ.3,599. దీంతో రీఛార్జ్ చేసుకుంటే, 2026 మార్చి వరకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 2.5GB డేటా, ఇంకా రోజుకి 100 SMS లు... వాడుకోవచ్చు. నెలనెలా రీఛార్జ్ తలనొప్పి వద్దు అనుకునే వాళ్లకు ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.
* డేటా, కాలింగ్ బెనిఫిట్స్ అదుర్స్..
ఈ రూ.3,599 ప్లాన్ తో 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. కానీ జియో ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ప్లాన్ చేసుకున్న వాళ్లకి 2026, మార్చి వరకు ఎక్స్‌ట్రా వ్యాలిడిటీని ఉచితంగా ఇస్తారు. అంటే ఇంకాస్త ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. డేటా విషయానికొస్తే, మొత్తం 912.5GB హై-స్పీడ్ డేటా వస్తుంది.

రోజుకి 2.5GB లిమిట్ ఉంటుంది. ఒకవేళ రోజుకిచ్చిన డేటా అయిపోతే స్పీడ్ కాస్త తగ్గి 64Kbps కి వస్తుంది. కానీ ఇంటర్నెట్ మాత్రం ఆగకుండా వాడుకోవచ్చు. ఇంకా ఇండియాలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. లోకల్ కాల్స్ అయినా, STD కాల్స్ అయినా ఉచితమే. రోజుకి 100 SMSలు కూడా ఫ్రీ.
* బోనస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..
జియో ఈ ప్లాన్‌తో పాటు కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తోంది. 90 రోజుల పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. కానీ ఇది మొబైల్‌లో మాత్రమే పనిచేస్తుంది. టీవీలోనో, లాప్‌టాప్ లోనో హాట్‌స్టార్ చూడాలంటే వేరే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అంతేకాదు, ఫొటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్ దాచుకోవడానికి 50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
* జియో రూ.355 ప్లాన్, నెలవారీ ఆప్షన్ కూడా ఉంది..
ఒకవేళ మీకు అంత లాంగ్ టర్మ్ ప్లాన్ వద్దు అనుకుంటే, జియో రూ.355 నెలవారీ ప్లాన్ కూడా అందిస్తోంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 SMSలు, ఇంకా మొత్తం 25GB డేటా ఇస్తారు. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా లిమిట్ ఉండదు. కానీ ఇందులో అన్‌లిమిటెడ్ 5G యాక్సెస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ లాంటివేమీ ఉండవు.
* రూ.3,599 ప్లాన్ వీళ్లందరికీ ఉత్తమం
అయితే 50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ మాత్రం ఉంటుంది. జియో తీసుకొచ్చిన రూ.3,599 ప్లాన్ మాత్రం నిజంగా చాలా ఉపయోగకరమైన ప్రీపెయిడ్ ప్లాన్. దాదాపు ఏడాది పాటు సర్వీస్, రోజుకి కావాల్సినంత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్... అన్నీ కలిపి చూస్తే ఇది నిజంగా పైసా వసూల్ ప్లాన్ అని చెప్పొచ్చు.
హాట్‌స్టార్, జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉండటంతో ఇది ఇంకాస్త ఆకర్షణీయంగా మారింది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం చూసేవాళ్లకి, డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వాళ్లకి ఈ ప్లాన్ పక్కాగా సరిపోతుంది. హాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఉచితంగా చూడాలనుకునే వారికి సైతం జియో రూ.3599 ప్లాన్ చాలా బాగా సరిపోతుంది.


Click it and Unblock the Notifications








