జియో రూ.3599 vs ఎయిర్‌టెల్ రూ.3999: 1 ఏడాది వ్యాలిడిటీ, రోజూ 2.5GB డేటా, 5G.. ఏ ప్లాన్ ఎంచుకోవాలి?
Jio Vs Airtel 1-year Plans : ఏడాది వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్‌లలో జియో, ఎయిర్‌టెల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? ఎక్కువ డేటా, కాలింగ్, స్ట్రీమింగ్ బెనిఫిట్స్‌తో ఏది మంచి ప్యాక్ అందిస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు సరైన చోటికే వచ్చారు. ఈ రెండు కంపెనీలు రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, 5G డేటా వంటి అదిరిపోయే ప్లాన్‌లను అందిస్తున్నాయి.
కానీ, ఒక కంపెనీ మాత్రం జియోసినిమా (JioCinema)/డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్కువ కాలం ఇస్తోంది. మరొక కంపెనీ ఓటీటీ ఉచితంగా ఇవ్వదు. మీకు ఏది ముఖ్యమనే దాన్ని బట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఏది సరిపోతుందో వివరంగా చూద్దాం పదండి.
* ఎయిర్‌టెల్ రూ.3999 ప్లాన్: ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్కువ ధర
ఎయిర్‌టెల్ 1 సంవత్సరం ప్లాన్ ధర రూ.3999. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తాయి. ఇది ఏకంగా 1 సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. షోలు, క్రికెట్, లేదా సినిమాలు ఫోన్‌లో ఎక్కువగా చూసేవారికి, ఇది పెద్ద బోనస్.
అయితే, ఈ ప్లాన్ జియో కంటే రూ. 400 ఎక్కువ. ప్రీమియం స్ట్రీమింగ్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారికి, ఎయిర్‌టెల్ ప్లాన్ మంచి విలువను అందిస్తుంది, నెలవారీ ఖర్చు సుమారు రూ. 333 అయినా సరే. కానీ, స్ట్రీమింగ్ మీకు అంత ముఖ్యం కాకపోతే, డబ్బు ఆదా చేయాలనుకుంటే, జియో ఆఫరే బలంగా కనిపిస్తుంది.
* జియో రూ.3599 వార్షిక ప్లాన్: తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు
జియో తక్కువ ధరకే రూ.3599 ప్లాన్‌ను అందిస్తోంది. ఇది మీకు ఏడాది పాటు కావాల్సినవన్నీ ఇస్తుంది. రోజుకు 2.5GB డేటాతో, మొత్తం సంవత్సరానికి 900GB కంటే ఎక్కువ డేటా వస్తుంది. వీడియోలు ఎక్కువగా చూసేవారికి, సోషల్ మీడియా వాడేవారికి, ఆన్‌లైన్ మీటింగ్‌లలో పాల్గొనేవారికి ఇది బాగా సరిపోతుంది.
అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS కూడా ఉన్నాయి. కాబట్టి కనెక్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరో ప్రత్యేక ఆకర్షణ అన్‌లిమిటెడ్ 5G డేటా. మీ దగ్గర 5G ఫోన్ ఉండి, 5G కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఉంటే, డేటా లిమిట్ గురించి ఆందోళన లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటా వాడుకోవచ్చు.
* ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే..
జియో 90 రోజుల జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (హాట్‌స్టార్ కంటెంట్‌తో సహా) అందిస్తుంది. ఇది బాగున్నా, ఎయిర్‌టెల్ ఆఫర్‌తో పోలిస్తే కాస్త తక్కువే. స్ట్రీమింగ్ ఎక్కువ వాడకపోయినా, వేరే సబ్‌స్క్రిప్షన్ ఉన్నా.. దీన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం రూ.276కే ఈ ప్లాన్ లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత విలువైన వార్షిక ప్లాన్లలో ఇది ఒకటి.
* ఏ ప్లాన్ ఉత్తమం?
జియో, ఎయిర్‌టెల్ రెండూ సమానమైన రోజువారీ డేటా, SMS, కాలింగ్, 5G ప్రయోజనాలతో మంచి వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రధాన తేడా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లోనే ఉంది. జియో 90 రోజులు ఇస్తే, ఎయిర్‌టెల్ ఏకంగా సంవత్సరం పాటు ఇస్తుంది. కాబట్టి, మీరు తక్కువ ధరలో మంచి ప్లాన్ కావాలనుకుంటే, జియో రూ.3599 రీఛార్జ్ సరైనది.
కానీ, మీరు అదనపు యాప్ ఖర్చులు లేకుండా ఎక్కువ కాలం స్ట్రీమింగ్ ఆనందించాలనుకుంటే, ఎయిర్‌టెల్ రూ.3999 ప్లాన్ బెటర్. చివరిగా, మీ ఎంపిక మీ ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది - డబ్బు ఆదా చేయడమా లేక ఎక్కువ కాలం స్ట్రీమింగ్ యాక్సెస్ కావాలా? ఏది ఏమైనా, ఒక్క రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ ఇచ్చే ఈ రెండు ప్లాన్‌లు గొప్ప విలువను అందిస్తాయి.


Click it and Unblock the Notifications








