మీరు రోజూ ఎక్కువగా డేటా ఉపయోగిస్తుంటారా.. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లు మీకోసమే..!
భారత్ టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో (Jio) తొలి స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. కాలింగ్, డేటా, ఓటీటీ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక ప్లాన్‌లున్నాయి. అయితే రోజువారీ అధిక డేటా అవసరాలు ఉన్న యూజర్ల కోసం జియో 2.5GB డేటాతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
జియో రూ.399 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs399 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌లో రోజువారీ 2.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ 4G డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps కు తగ్గుతుంది.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 70 GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. జియోటీవీ, 50GB వరకు జియో ఏఐ క్లౌడ్ యాప్‌లో స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.
జియో రూ.2025 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs2025 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా రోజువారీ 2.5GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ 4G డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps కు తగ్గుతుంది.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 200 రోజులుగా ఉంది. మొత్తంగా 500GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. 90 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు జియోటీవీ యాప్‌ను వినియోగించుకోవచ్చు. మరియు 50GB వరకు జియో ఏఐ క్లౌడ్ యాప్‌లో స్టోరేజీ చేసుకోవచ్చు.
జియో రూ.3599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2.5GB 4G డేటాను అందిస్తోంది. 4G డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps కు తగ్గుతుంది. దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs3599 Recharge Plan) వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 912.5GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియో టీవీ యాప్, జియోఏఐ క్లౌడ్ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో ఏఐ క్లౌడ్ యాప్‌లో 50GB వరకు స్టోరేజీ చేసుకోవచ్చు.
జియో రూ.3999 రీఛార్జ్ ప్లాన్ :
జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2.5GB 4G డేటాను అందిస్తోంది. ఆ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps కు తగ్గుతుంది. దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Jio Rs3999 Recharge Plan) వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. మొత్తంగా 912.5GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియో టీవీ యాప్, జియోఏఐ క్లౌడ్, ఫ్యాన్‌కోడ్ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో ఏఐ క్లౌడ్ యాప్‌లో 50GB వరకు స్టోరేజీ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








