జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.479.. అన్‌లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీ..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో గత నెలలో తమ మొబైల్ టారిఫ్ రీఛార్జ్ ధరలను పెంచింది. దీంతో అనేక మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. అయితే కస్టమర్లను ఆకట్టుకొనేలా మరియు వారి అవసరాలకు తగినట్లు రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో కేవలం కాల్స్ మాత్రమే కావాలని భావిస్తున్న వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.479 ద్వారా (Jio RS479 Recharge Plan) ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా మొత్తంగా 1000 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 6GB డేటాను పొందవచ్చు. కాలింగ్‌తోపాటు ఎక్కువ వ్యాలిడిటీ కోరుకొనే వారికి ఈ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది.

ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందే అవకాశం లేదని తెలిపింది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం జియో యాప్, జియో పోర్టల్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకొనే అవకాశం ఉంది.
అలాగే జియో రూ.799 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిడెట్ కాలింగ్ సహా రోజువారీ 1.5GB డేటా, 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అయితే మరికొన్ని జియో రీఛార్జ్ ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీతో ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ ప్లాన్‌ల పూర్తి వివరాలు.
జియో రూ.1029 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS మరియు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మరియు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
అదే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.1049 ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS, 2GB డేటాను పొందవచ్చు. Sony LIV మరియు ZEE5 ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
జియో రూ.1299 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు సహా ప్రతిరోజు 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








