జియో రూ.601 రీఛార్జ్ ప్లాన్.. ఏకంగా 365 రోజులపాటు అన్‌లిమిటెడ్ 5G డేటా..!
జియో ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నాయి. ప్రైవేటు టెలికాం సంస్థలు ఈ సంవత్సరం జులైలో తమ మొబైల్ టారిఫ్‌ల ధరలను పెంచాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను కనీసం 15 శాతం పెంచాయి. దీంతో అనేక మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ సంస్థ BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ వినియోగదారులకు కాపాడుకొనేందుకు అనేక ఆకర్షణీయ రీఛార్జ్ ప్లాన్‌లు, ఆఫర్‌లను అందిస్తున్నాయి.
జియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. 5G నెట్‌వర్క్ ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 5G నెట్‌వర్క్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న వినియోగదారులకు ఉచితంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను (Jio RS601 Prepaid Recharge Plan) అందించింది. అయితే క్రమంగా మార్పులు చేసింది.

అనంతరం అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందేందుకు కనీసం రూ.239 సహా అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసిన వినియోగదారులకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం జులై తర్వాత మరిన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం జియో 5G డేటాను పొందేందుకు కనీసం రోజువారీ 2GB డేటా అందించే ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాలని సూచించింది.
దీంతోపాటు 5G డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్‌లను కూడా విడుదల చేసింది. ఇందులో రూ.51, 101, రూ.151 బూస్టర్ ప్లాన్‌లు ఉన్నాయి. రూ.51 రీఛార్జ్‌తో 3GB 4G డేటా, రూ.101 ప్లాన్‌తో 6GB, రూ.151 ప్లాన్‌తో 9GB డేటాను అందిస్తోంది. అయితే తాజాగా రూ.601 డేటా వోచర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. బేసిక్ ప్లాన్‌లో 5G డేటాలేని యూజర్లు కూడా ఈ డేటా వోచర్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. సంవత్సరం కాలం పాటు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.
ఈ రూ.601 డేటా వోచర్‌ను జియో యాప్ నుంచే కొనుగోలు చేయవచ్చు. మరియు వెంటనే యాక్టివేట్ చేయవచ్చు. రూ.299 అంతే కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేస్తేనే.. ఈ డేటా వోచర్‌ను వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీని వ్యాలిడిటీ సంవత్సర కాలం పాటు ఉంటుంది.
దీంతోపాటు జియో రూ.19 రీఛార్జ్‌తో 1GB డేటాను పొందవచ్చు. ఒకరోజు వ్యాలిడిటీ మాత్రమే ఉంది. రూ.49 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఒక్కరోజు వ్యాలిడిటీని అందిస్తోంది. రూ.139 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 12GB డేటాను పొందవచ్చు. రూ.179 డేటా వోచర్ ద్వారా 10GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 10 OTT యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
జియో రూ.219 రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీతో 30GB హై స్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే రూ.359 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 50GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లలో కేవలం డేటాను మాత్రమే అందిస్తోంది. ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.


Click it and Unblock the Notifications