Home
News

Jio ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీతో 164GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌.. పూర్తి వివరాలు..!

జియో ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ గా ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 20GB డేటాను (Jio Offers 20GB Date additional Data) అదనంగా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిడెట్‌ కాలింగ్‌తోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ ప్రయోజనాల పూర్తి వివరాలు.

జియో రూ.749 రీఛార్జ్ ప్లాన్‌ :
జియో అధికారిక వెబ్‌సైట్‌ ఆధారంగా జియో రూ.749 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. అంటే 144GB డేటాను పొందవచ్చు.

Jio RS749 Prepaid recharge plan offers additional 20GB data with 72 days validity

20GB డేటా అదనంగా పొందవచ్చు.. :
దీంతోపాటు ఈ ప్లాన్‌లో అదనంగా 20GB డేటాను జియో అందిస్తోంది. మొత్తంగా 164GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్రయోజనాలతోపాటు జియోటీవీ, జియోక్లౌడ్‌, జియోసినిమా వంటి ఓటీటీలను వినియోగించుకోవచ్చు.

జియో రూ.999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియో సినిమా, జియోటీవీ, జియో క్లౌడ్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

జియో రూ.1029 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లో ఇటీవల కీలక మార్పు చేసింది. ఈ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 168GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు ఇటీవల వరకు ఈ ప్లాన్‌లో భాగంగా ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్ర్కిప్షన్‌ను జియో అందించేది. అయితే తాజాగా ఇందులో మార్పులు చేసింది. ఇక నుంచి ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ ను HD (720p) నాణ్యతతో రెండు పరికరాల్లో ఉపయోగించుకోవచ్చు. అమెజాన్‌లో ఒక్కరోజులోనే ఆర్డర్‌ చేసిన ఉత్పత్తులను డెలివరీ అవకాశాన్ని పొందవచ్చు. అదే ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను కేవలం మొబైల్‌లోనే వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరియు కేవలం స్టాండర్డ్‌ డెఫినిషన్‌లోనే వీడియోలు వీక్షించవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio RS749 Prepaid recharge plan offers 164 GB Data with 72 days validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X