Home
News

ఈ రెండు రీఛార్జ్‌ ప్లాన్‌లలో అదనంగా 20GB డేటా.. పూర్తి వివరాలు!

భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో తొలి స్థానంలో ఉంది. ఇటీవల వార్షికోత్సవం కూడా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా జియో 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం జియో అనేక ప్రత్యేకమైన రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రోజువారీ డేటాతోపాటు అదనపు డేటాను కూడా అందిస్తోంది. ఈ జాబితాలో రూ.749, రూ.899 వంటి ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాల వివరాలు.

* జియో రూ.749 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అదనంగా 20GB 4G డేటాను కూడా అందిస్తోంది.

Jio Rs749  Rs899 Prepaid Recharge Plans

ఈ ప్లాన్‌ లో (Jio Rs749 Prepaid Recharge Plan) 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌ లో భాగంగా జియో టీవీ, జియో ఏఐక్లౌడ్‌ యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB వరకు క్లౌడ్‌ స్టోరేజీని పొందవచ్చు. దీంతోపాటు కొన్ని స్పెషల్‌ ఆఫర్లను కూడా జియో అందిస్తోంది.

* రూ.899 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 20GB 4G అదనపు డేటాను అందిస్తోంది.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో (Jio Rs899 Prepaid Recharge Plan) 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌ లో జియో టీవీ యాప్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియో ఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించుకోవచ్చు. కొన్ని స్పెషల్‌ ఆఫర్లను కూడా అందిస్తోంది.

* జియో రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్‌ ను పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.

ఈ ప్లాన్ (Jio Rs999 Prepaid Recharge Plan) వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 196GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియో హాట్‌స్టార్ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. జియో టీవీ ను ఉపయోగించుకోవచ్చు. జియో ఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB స్టోరేజీని పొందవచ్చు. దీంతోపాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Rs749, Rs899 Prepaid Recharge Plans Offers additional 20GB data, full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X