జియో రూ.895 రీఛార్జ్ ప్లాన్‌తో ఏకంగా 11 నెలల వ్యాలిడిటీ... అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ఇతర ప్రయోజనాలు..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రస్తుతం దేశంలో అధిక సంఖ్యలో వినియోగదారులకు కలిగి ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తన వినియోగదారుల కోసం అనేక మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. డేటా, వ్యాలిడిటీ సహా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్‌లు ఉన్నాయి. కొంత మంది వినియోగదారులు అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ వైపు మొగ్గు చూపుతుండడంతో ఆ తరహా ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
జియో రూ.895 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అంటే సుమారు 11 నెలలపాటు రీఛార్జ్‌లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే నెలవారీ సుమారుగా రూ.75 ఖర్చు కానుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు డేటా, ప్రయోజనాలను పొందవచ్చు.

అంటే ఈ ప్లాన్ గడువు 336 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. డేటా, SMS ప్రయోజనాల విషయానికి వస్తే.. మొత్తం వ్యాలిడిటీలో ప్రతి 28 రోజులకు ఒకసారి 2GB డేటా, 50 SMS లను పొందవచ్చు. డేటా కంటే కాలింగ్ ప్రాధాన్యత కలిగిన వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో 24GB డేటాను పొందవచ్చు. వీటితో పాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ ను వినియోగించుకోవచ్చు. అయితే జియోసినిమా ప్రీమియం యాక్సెస్ పొందే అవకాశం లేదు. అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ఫోన్‌ల వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులో లేదు.
సుమారుగా ఇదే ధరలో 2GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. జియో రూ.859 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB హైస్పీడ్ డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సర్వీసులను పొందవచ్చు.
అదే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.899 ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటాతోపాటు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
జియో రూ.749 ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 2GB హైస్పీడ్ డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంటుంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
జియో రూ.3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 912.5GB డేటాను వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








