జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ 5G డేటా సహా ఎన్నో ప్రయోజనాలు..!
ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే జులైలో మొబైల్ టారిఫ్ ఛార్జీలను పెంచడంతో అనేక మంది BSNL సహా ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నాయి. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు వీలుగా తాజాగా మెరుగైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 98 రోజుల వ్యాలిడిటీని (Jio 98 Days Validity recharge plan) పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G ని కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ధర, వ్యాలిడిటీ, డేటా సహా ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలు.
జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్ (Jio RS999 Recharge Plan) ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉన్నట్లు జియో వెల్లడించింది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్, 4G డేటా, 5G డేటా సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. మరియు జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలను కూడా వినియోగించుకోవచ్చు. జియో వెబ్‌సైట్, MyJio యాప్ ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.

జియో రూ.999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. జియో క్లౌడ్, జియోసినిమా, జియోటీవీ వంటి యాప్‌ను వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు సుమారు ఇదే ధరలో మరో ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో రూ.949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS, 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
జియో రూ.1029 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.1049 ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటా సహా 100 SMS లను పొందవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ZEE5, Sony LIV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
అదే విధంగా జియో రూ.1299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటాపరంగా రోజువారీ 2GB డేటా సహా అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








