Home
News

జియోలో ఉన్న ఈ రెండు రీఛార్జ్‌ ప్లాన్‌ల గురించి మీకు తెలుసా?

జియో ప్రస్తుతం 50 కోట్లకు పైగా యూజర్లతో భారత్‌ టెలికాం రంగంలో తొలి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, BSNL తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే భారీగా ఉన్న యూజర్ల కోసం జియో అనేక ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల అవసరాలకు తగినట్లుగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMS, డేటాను అందిస్తోంది. రూ.999, రూ.1028 రీఛార్జ్‌ ప్లాన్‌ల వివరాలు మీకోసం.

* రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs999 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.

Jio Rs999  Rs1028 Prepaid Recharge Plans

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 196GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వీటితోపాటు జెమిని ప్రో ప్లాన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ప్రో మోడల్‌ ధర రూ.35100 గా ఉందని, కానీ 18 నెలల వరకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో చెబుతోంది.

జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ వంటి యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీ చేసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా జియో తన యూజర్ల కోసం అందిస్తోంది.

* రూ.1028 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1028 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌/ STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వీటితోపాటు జెమిని ప్రో ప్లాన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ప్రో మోడల్‌ ధర రూ.35100 గా ఉందని, కానీ 18 నెలల వరకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో చెబుతోంది.

ఈ ప్లాన్‌లో యూజర్లు స్విగ్గీ వన్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.149 కంటే అధిక ధర కలిగిన డెలివరీలు ఉచితం. రూ.199 కంటే అధిక ధర కలిగిన ఇన్‌స్టామార్ట్‌ 10 డెలివరీలు ఉచితం. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ వంటి యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీ చేసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా జియో తన యూజర్ల కోసం అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌ లో రూ.50 క్యాష్‌బ్యాక్‌ కూపన్‌ అందిస్తుంది. రూ.1028 రీఛార్జ్ పైన ఈ కూపన్‌ను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Rs999, Rs1028 Prepaid Recharge Plans Offers best benefits Full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X