అదను చూసి దెబ్బ కొట్టిన జియో, టెల్కోలకు భారీ షాక్ !

టెల్కో దిగ్గజాలను ముప్పతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియో మరో యుద్ధానికి తెరలేపింది.

By Hazarath
|

టెల్కో దిగ్గజాలను ముప్పతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియో మరో యుద్ధానికి తెరలేపింది. ఇప్పటికే కోట్ల నష్టాలను చవిచూస్తున్న టెల్కోలకు మరింతగా నష్టాలను రుచి చూపించబోతోంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ కాల్స్‌పై జియో తన దృష్టిని కేంద్రీకరించబోతోంది.

 

4000mAh బ్యాటరీతో Shine M815 4జీ ఫోన్, ధర రూ. 4,999 మాత్రమే !4000mAh బ్యాటరీతో Shine M815 4జీ ఫోన్, ధర రూ. 4,999 మాత్రమే !

అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్ల(ఐటీఆర్‌)ను..

అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్ల(ఐటీఆర్‌)ను..

అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్ల(ఐటీఆర్‌)ను నిమిషానికి 6 పైసలు, తర్వాత జీరోకి తీసుకురావాలని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, టెలికాం రెగ్యులేటరీని కోరుతోంది.

ప్రస్తుతమున్న ఛార్జీలను..

ప్రస్తుతమున్న ఛార్జీలను..

ప్రస్తుతమున్న ఛార్జీలను 53 పైసల నుంచి రూ.1కి పెంచాలని టెల్కోలు కోరుతున్న క్రమంలో జియో ఈ మేర అభ్యర్థనను టెలికాం రెగ్యులేటరీ ముందుంచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను..

దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను..

ఇప్పటికే దేశీయంగా విధించే ఐయూసీ ఛార్జీలను ట్రాయ్‌, 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించింది. అంతే కాకుండా 2020 నాటికి వాటిని జీరో చేయనున్నట్టు కూడా ప్రకటించింది.

టెల్కోలు భారీగా తమ రెవెన్యూలను..
 

టెల్కోలు భారీగా తమ రెవెన్యూలను..

ఈ తగ్గింపుతో టెల్కోలు భారీగా తమ రెవెన్యూలను కోల్పోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ కాల్‌ టెర్మినేషన్‌ రేట్లను కూడా జియో తగ్గించాలని కోరుతుండటంతో ఇది టెల్కోలను మరింత నష్టాల్లోకి దిగజార్చనుందని తెలుస్తోంది.

రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు ..

రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు ..

అంతర్జాతీయ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ద్వారా దాదాపు రూ.5000 కోట్ల వరకు రెవెన్యూలు వస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు 60 శాతానికి పైగా దేశీయ వైర్‌లెస్‌ యూజర్‌ బేస్‌ను కలిగి ఉన్నాయి.

ఫారిన్‌ క్యారియర్‌, స్థానిక ఆపరేటర్‌కు చెల్లించడం ద్వారా..

ఫారిన్‌ క్యారియర్‌, స్థానిక ఆపరేటర్‌కు చెల్లించడం ద్వారా..

దీంతో ఐటీఆర్‌ రేట్లను తగ్గించడం, టెలికాం కంపెనీలను మరోసారి భారీగా దెబ్బకొట్టనుందని తెలుస్తోంది. ఈ రేటును ఫారిన్‌ క్యారియర్‌, స్థానిక ఆపరేటర్‌కు చెల్లించడం ద్వారా కంపెనీలు తమ ఆదాయాన్ని గడిచేందుకు అవకాశం కలుగుతోంది. ఇప్పుడు దీనికి జియో ఎసరుతెస్తోంది.

ఓటీటీ కాల్స్‌

ఓటీటీ కాల్స్‌

నేడు ఓటీటీ కాల్స్‌(వాట్సాప్‌ కాల్స్‌, ఫేస్‌టైమ్‌ ఆడియో..) పాపులారిటీ పెరిగిపోతుండటంతో, జియో ఐటీఆర్‌ రేట్లపై కన్నేసి వాటిని తగ్గించాలని కోరుతోంది. ఐటీఆర్‌ రేట్లు తగ్గితే, భారత్‌కు చేసే కాల్స్‌ రేట్లు కూడా తగ్గిపోనున్నాయి.

Best Mobiles in India

English summary
Jio sets stage for another fight over IUC, this time over international calls Read more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X