జులై నుంచి వరుసగా యూజర్లు షాక్ ఇస్తే.. తాజాగా యూజర్లకు గట్టి షాక్ ఇచ్చిన జియో.. అసలు ఏం జరిగింది..?
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఈ సంవత్సరం జులైలో భారీగా రీఛార్జ్ ధరలను పెంచింది. దీంతో అసంతృప్తికి గురైన యూజర్లు జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో షాక్ ఇచ్చారు. ఈ నాలుగు నెలల్లో జియో కోటికి పైగా యూజర్లు గుడ్‌బై చెప్పారు. అయితే తాజాగా యూజర్లకు జియో షాకింగ్ న్యూస్ చెప్పింది. రూ.19, రూ.29 డేటా రీఛార్జ్‌ల వ్యాలిడిటీని పూర్తిగా తగ్గించింది.
జియో షాకింగ్ నిర్ణయం :
జియో యూజర్లు అత్యవసర సమయాల్లో అదనపు డేటా కోసం రూ.19, రూ.29 డేటా వోచర్ అందుబాటులో ఉన్నాయి. రూ.19 రీఛార్జ్‌తో 1GB డేటాను అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు బేసిక్ ప్లాన్ గడువు ఉన్నంత వరకు 1GB డేటాను వినియోగించుకొనే అవకాశం ఉండేది. కానీ తాజాగా ఈ గడువును జియో కేవలం ఒక్కరోజుకు పరిమితం చేసింది.

జియో రూ.29 రీఛార్జ్ ప్లాన్ :
అంటే రూ.19 రీఛార్జ్‌తో (Jio Rs19 Data Voucher) 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక్కరోజుగా ఉంది. అదే రూ.29 రీఛార్జ్ ప్లాన్‌తో గతంలో 2GB డేటాను అందించేది. బేసిక్ ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ 2GB డేటాను వినియోగించుకొనే అవకాశం ఉండేది. అయితే తాజాగా 2GB డేటాను అందిస్తూనే, గడువును 2 రోజులకు పరిమితం చేసింది.
ఇటీవల లాంచ్ అయిన ప్లాన్ వ్యాలిడిటీ గంట మాత్రమే :
జియో రూ.29 రీఛార్జ్‌పై (Jio Rs29 Data Voucher) ప్రస్తుతం 2 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటాను పొందవచ్చు. జియో వెబ్‌సైట్ ఆధారంగా కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. జియో ఇటీవలే రూ.11 డేటా వోచర్ ను లాంచ్ చేసింది. ఈ డేటా వోచర్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అయితే వ్యాలిడిటీ గంట మాత్రమే ఉంటుంది.
అన్‌లిమిటెడ్ 5G డేటా వోచర్‌లు :
జియో ఇటీవల రూ.601 డేటా వోచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 12 అన్‌లిమిటెడ్ డేటా వోచర్‌లను పొందవచ్చు, ఒక్కో వోచర్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. మై జియో యాప్ ద్వారా ఈ వోచర్‌లను యాక్టివేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఒక్కో వోచర్ ద్వారా ప్రతి రోజు అదనంగా 3GB 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
అయితే ఓ కండిషన్ :
జియో రూ.601 డేటా వోచర్‌ను కొనుగోలు చేసేందుకు యూజర్లు కచ్చితంగా రూ.199, రూ.239, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.766, రూ.899 ప్లాన్‌లతో ఏదైనా ప్లాన్‌ను కలిగి ఉండాలి. ఈ ప్లాన్‌లు రోజువారీ 1.5GB లేదా అంతకంటే ఎక్కువ 4G డేటాను అందిస్తాయి.
ఈ డేటా వోచర్‌లను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు :
రోజువారీ 1GB డేటా అందించే రీఛార్జ్ ప్లాన్‌లు మరియు రూ.1899 రీఛార్జ్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న యూజర్లు రూ.601 డేటా వోచర్‌ను వినియోగించుకోలేరని జియో తెలిపింది. దీంతోపాటు ఈ అన్‌లిమిటెడ్ 5G డేటా వోచర్‌లను ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం కూడా ఉందని జియో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








