Home
News

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం SpaceX తో జియో ఒప్పందం.. ఎయిర్‌టెల్ ఇప్పటికే డీల్‌..!

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ రంగంలో మరో కీలక ప్రకటన వెలువడింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్‌ నిన్న ప్రకటన చేసింది. అయితే తాజాగా మరో కీలక ప్రకటన వెలువడింది. జియో కూడా స్పేస్‌ఎక్స్‌తో జతకట్టింది. ఈ మేరకు తాజాగా ప్రకటన (Jio joins with Elon Musk's SpaceX) చేసింది. ఫలితంగా స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌.. తన ఉపగ్రహాల ద్వారా హైస్పీడ్‌ బ్రాండ్‌బ్యాండ్‌ను అందించనుంది. స్టార్‌లింక్‌ ద్వారా అనుమతులు వచ్చాక.. సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

జియో అధికారిక ప్రకటన :
జియో తన వినియోగదారులకు స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పే‌స్‌ఎక్స్‌తో ఒప్పందంపై సంతకం చేసినట్లు జియో అధికారిక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం స్టార్‌లింక్‌కు ఇచ్చే అనుమతి పై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని తెలిపింది.

jio signs deal with Elon Musk s SpaceX

ఇప్పటికే డీల్‌ కుదుర్చుకున్న ఎయిర్‌టెల్‌ స్పేస్‌ఎక్స్ :
మంగళవారం సాయంత్రం ఎయిర్‌టెల్‌- స్పేస్‌ఎక్స్ మధ్య ఒప్పందం కుదిరింది. బుధవారం ఉదయం జియో - స్పేస్‌ఎక్స్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రకటన రావడం గమనార్హం. జియో, స్టార్‌లింక్‌ లు పరస్పరం సహకారం అందించుకోనున్నాయి.

పరస్పర సాయం :
రిలయన్స్ జియో తన అవుట్‌లెట్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌లో స్టార్‌లింక్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. జియో కస్టమర్‌ సర్వీస్‌ ఇన్‌స్టాలేషన్‌, యాక్టివేషన్‌ కోసం సపోర్టు స్టాఫ్‌ మెకానికాన్ని ఏర్పాటు చేస్తుంది. సంస్థలు, ఇతర వ్యాపార, కమ్యూనిటీలకు హైస్పీడ్‌ అందించడం తమ ఉద్దేశమని పేర్కొంది.

అదే విధంగా స్టార్‌లింక్‌ కూడా జియోకు సాయం చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియోఎయిర్‌ ఫైబర్‌, జియోఫైబర్‌లతోపాటు కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ను విస్తరించేందుకు సాయం చేస్తుంది. ఫలితంగా మారుమాల, గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా జియో గ్రూప్‌ సీఈవో మాథ్యూ ఊమెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయలకు అందుబాటులో ధరలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ పొందేలా చూసుకోవడం జియో సంస్థ ప్రాధాన్యతగా చెప్పారు. అందరికి మెరుగైన కనెక్టివిటీని అందించడంలో భాగంగా స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తమ నిబద్ధతను సూచిస్తుందన్నారు.

స్పేస్‌ఎక్స్ కూడా జియోతో భాగస్వామ్యంపై స్పందించింది. స్టార్‌లింక్‌ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను మరింత మంది వ్యక్తులు సహా సంస్థలుకు అందించేందుకు జియోతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటంగ్‌ ఆఫీసర్ గ్విన్‌ షాట్‌వెల్‌ తెలిపారు. భారత ప్రభుత్వ నుంచి అనుమతి పొందేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌.. స్పేస్‌ఎక్స్‌తో నిన్న (మార్చి 11) ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వం స్పేస్‌ఎక్స్‌కు ఇచ్చే అనుమతిపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు ఎయి‌ర్‌టెల్‌, స్పేస్‌ఎక్స్‌ పరస్పరం సహకారం అందించుకోనున్నాయి.

ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్‌ ఒప్పందంలో భాగంగా.. నెట్‌వర్క్ విస్తరించేందుకు, నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు ఎయిర్‌టెల్‌కు.. స్టార్‌లింక్ సాయం చేస్తుంది. అలాగే ఎయిర్‌టెల్‌ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందించడం, ఎయిర్‌టెల్‌ ద్వారా స్టార్‌లింక్ సేవలు.. స్కూల్స్‌, హెల్త్‌ సెంటర్‌లు, కమ్యూనిటీలకు అనుసంధానం చేసే అవకాశాలను అన్వేషిస్తుంది. మరియు ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటుంది.

భూ దిగువ కక్ష్యలో ఉపగ్రహాల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను స్పేస్‌ఎక్స్‌ అందిస్తోంది. ఇప్పటికే 100 దేశాల్లో సేవలు అందిస్తోంది. అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్‌, ఆస్ట్రేలియా, UK, మంగోలియా వంటి అనేక దేశాలున్నాయి. ఇటీవలే భూటాన్‌లోనూ స్టార్‌లింక్‌ ద్వారా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లోనే సేవలు ప్రారంభించినా.. గత నెలలో అధికారికంగా వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
jio signs deal with Elon Musk's SpaceX for satellite internet in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X