Jio Star చివరి దశకు జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ విలీనం.. రెండు రోజుల్లో జియోస్టార్ అందుబాటులోకి..?
ఓటీటీ మార్కెట్‌లో కీలక మార్పులు రానున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలు జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ విలీన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ రెండింటి విలీనం ఈ సంవత్సరం తొలి రోజుల్లోనే ప్రారంభమైంది. విలీనం అనంతరం జియో స్టార్ పేరుతో అందుబాటులో ఉంటుంది. ఈ విలీన ప్రక్రియ నవంబర్ 13 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు అంటే 14 తేదీ నుంచే జియోస్టార్ వెబ్‌సైట్ లైవ్‌లోని రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్‌ప్లిక్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు జియోస్టార్ పోటీనిచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ రెండు ఓటీటీలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. జియో స్టార్ (Jio star) రానున్న రోజుల్లో ఈ రెండింటితో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఓటీటీ ల్యాండ్‌స్కేప్‌లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

డిస్నీ + హాట్‌స్టార్, జియోసినిమా ప్రస్తుత కంటెంట్, ఇతర వనరులు కొత్త ప్లాట్‌ఫాం దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కంటెంట్, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని ఓటీటీ యూజర్లకు అందించాలనే లక్ష్యంతో జియో స్టార్ పనిచేస్తుందని చెబుతున్నారు. ఫలితంగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే త్వరలో ప్రారంభం కానున్న జియోస్టార్ ఓటీటీ ధరలు, కంటెంట్ విషయంలో ఎలాంటి స్ట్రేటజీని అమలు చేస్తారనే విషయంలో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కొన్ని నెలలపాటు ఇతర ప్లాట్‌ఫాంల కంటే తక్కువ ధరకే ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జియో సినిమా, హాట్‌స్టార్ విలీన ప్రకటన అనంతరం ఢిల్లీకి చెందిన ఓ యాప్ డెవలపర్ ముందుగానే జియో హాట్‌స్టార్ డొమైన్‌ను తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. అనంతరం కీలక ప్రకటన చేశాడు. కోటి రూపాయలు ఇస్తే జియో హాట్‌స్టార్ డొమైన్‌ను ఇచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. దీనిపై జియో నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అనంతరం జియో హాట్‌స్టార్ డొమైన్‌ను దుబాయ్‌కు చెందిన చిన్నారులు కొనుగోలు చేశారు. దీనిపై వారు కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ సంస్థ కోరుకుంటే ఈ డొమైన్‌ను ఉచితంగానే అందిస్తామని తెలిపారు. యాప్ డెవలపర్‌కు సాయం చేసేందుకు అతని వద్ద నుంచి డొమైన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఆఫర్ పైనా రిలయన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
రిలయన్స్, హాట్‌స్టార్‌ల విలీనానికి గతంలోనే అనుమతి లభించింది. ప్రస్తుతం జియో సినిమా IPL సహా ఇతర కంటెంట్‌ను ఉచితంగానే అందిస్తోంది. విలీనం అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో జియో సినిమా 100 మిలియన్ డౌన్‌లోడ్స్, డిస్ని + హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి.
స్టార్ ఇండియా సంస్థ డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీతోపాటు వివిధ టీవీ ఛానళ్లను ప్రస్తుతం కలిగి ఉంది. రిలయన్స్‌కు చెందిన వయాకాం వివిధ ఛానళ్లతోపాటు జియో సినిమా ఓటీటీని కలిగి ఉంది. మరో రెండు రోజుల్లో జియోస్టార్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








