40కోట్ల యూజర్లతో నెంబర్ 1 టెలికామ్ సంస్థగా Jio! దరిదాపులలో ఎవరు లేరు...

|

ఇండియాలోని టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించినప్పటి నుంచి ఎదో ఒక సంచలనం సృష్టిస్తున్నది. మొదటి సంవత్సరం వినియోగదారులకు ఉచితంగా అపరిమిత కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను అందించిన జియో సంస్థ తరువాత కాలంలో వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకుకోవడానికి చాలా రకాల కొత్త కొత్త రకమైన ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ లను అందించింది. అయితే ఇప్పుడు ఇది 40 కోట్ల కస్టమర్లను కలిగిన ఏకైక మొబైల్ సర్వీసు ప్రొవైడర్ గా రిలయన్స్ జియో అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వైర్‌లెస్ చందాదారులలో జియో వృద్ధి రేటు
 

వైర్‌లెస్ చందాదారులలో జియో వృద్ధి రేటు

భారతదేశంలో మొత్తం వైర్‌లెస్ చందాదారులు జూన్ చివరినాటికి 114 కోట్ల నుండి జూలై చివరినాటికి 114.4 కోట్లకు పెరిగింది. అంటే నెలవారీ వృద్ధి రేటు 0.30 శాతం నమోదైంది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 2020 నెలలో జియో మొబైల్ సర్వీసు ప్రొవైడర్ 35.54 లక్షల మంది కొత్త సభ్యులను తన యొక్క ఫ్లాట్ ఫారంలో చేర్చుకున్నది. VI గా రూపాంతరం చెందిన వోడాఫోన్ ఐడియా 37.26 లక్షల మంది సభ్యులను కోల్పోగా , భారతి ఎయిర్‌టెల్ 32.6 లక్షల మందిని, బిఎస్‌ఎన్‌ఎల్ 3.88 లక్షల మంది సభ్యులను మరియు MTLN 5,457 మంది సభ్యులను ఈ నెలలో కోల్పోయింది.

Also Read: IPL 2020 వీక్షణ కోసం Airtel, Jio కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!!!

టెలికాం మార్కెట్ వాటాలో జియో స్థానం

టెలికాం మార్కెట్ వాటాలో జియో స్థానం

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదిక ప్రకారం 40,08,03,819 మంది చందాదారులతో రిలయన్స్ జియో వైర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటాలో అందరికంటే ముందు వరుసలో ఉంది. జూలై 31, 2020 నాటికి జియో, ఎయిర్‌టెల్ మరియు VI వంటి ప్రైవేట్ సర్వీసు ప్రొవైడర్లు వైర్‌లెస్ చందాదారుల యొక్క 89.33 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు. అయితే రెండు PSU యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లైన బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్ఎల్ మార్కెట్ వాటాలో కేవలం 10.67 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. . కోల్‌కతా టెలికాం సర్కిల్ జూలై నెలలో తన వైర్‌లెస్ చందాదారుల స్థావరంలో 2.03 శాతం గరిష్ట వృద్ధికి పెరిగింది. 2020 జూలై నెలలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం 75 లక్షలకు పైగా అభ్యర్థనలు వచ్చాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వృద్ధి రేటు

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వృద్ధి రేటు

జూలై నెలలో బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య కూడా 70.5 కోట్లకు పెరిగిందని ట్రాయ్ నివేదిక తెలిపింది. జూన్ నెలలో దీని యొక్క విలువ 69.8 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్, మరియు అట్రియా కన్వర్జెన్స్ వంటి ఐదు సర్వీసు ప్రొవైడర్లు జూలై చివరిలో మొత్తం బ్రాడ్‌బ్యాండ్ చందాదారులలో 98.91 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Jio Telecom Operator Cross 40 Crore Subscribers in July 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X