మళ్ళీ దుమ్ము రేపిన జియో
జియో స్పీడ్‌లో దుమ్మురేపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకునేందుకు మైస్పీడ్ యాప్‌ను గతంలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
జియో స్పీడ్‌లో దుమ్మురేపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను తెలుసుకునేందుకు మైస్పీడ్ యాప్‌ను గతంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా యూజర్లు చెక్ చేస్తున్న మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ వివరాలను సేకరించి ట్రాయ్ ఎప్పటికప్పుడు టాప్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తున్న కంపెనీల వివరాలను తెలియజేస్తున్నది.ఈ వివరాల ప్రకారం దేశంలో రిలయన్స్‌కు చెందిన జియో 4జీ మొబైల్ ఇంటర్నెట్ నవంబర్ మాసానికి టాప్ ప్లేస్‌లో నిలిచింది.

సగటున 20.3 ఎంబీపీఎస్
దేశంలో జియో 4జీ ద్వారా యూజర్లకు అందుతున్న మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ సగటున 20.3 ఎంబీపీఎస్ ఉందని ట్రాయ్ వెల్లడించింది.

జియో తరువాత ఎయిర్‌టెల్
ఇక జియో తరువాత రెండో స్థానంలో 9.7 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఎయిర్‌టెల్ నిలిచింది. గత నెలలో ఇది 9.5గా ఉంది.

తరువాత స్థానాల్లో
ఆ తరువాత స్థానాల్లో వరుసగా వోడాఫోన్ ( 6.8 ఎంబీపీఎస్), ఐడియా ( 6.2 ఎంబీపీఎస్)లు నిలవడం గమనార్హం.

అప్‌లోడ్ స్పీడ్‌లో టాప్ ఐడియా
అప్‌లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది.చివరి ప్లేస్ లో ఎయిర్‌టెల్(4)గా నిలిచింది.

డౌన్‌లోడ్ స్పీడ్ కీలకమైన రోల్ ప్లే చేస్తుంది
యూజర్ల విషయంలో డౌన్‌లోడ్ స్పీడ్ కీలకమైన రోల్ ప్లే చేస్తుంది . వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్‌లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్‌లోడ్ స్పీడ్ చూస్తారు


Click it and Unblock the Notifications








