Home
News

రిలయన్స్ జియో స్పీడ్ 25.6 mbps, ఇదే అత్యధిక వేగమట !

టెలికాం ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

By Hazarath

టెలికాం ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 4జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌లో దేశీయ దిగ్గజాలకు సవాల్ విసురుతూ మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు భారీ నిరాశను మిగిల్చింది.

ఆరంభం నుంచి కస్టమర్లకు ..

ఆరంభం నుంచి కస్టమర్లకు ..

ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్‌ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా..

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా..

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్‌ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది.

వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్..

వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్..

జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్‌ వేగాన్ని అందించాయి. అప్‌లోడ్‌ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది.

ఐడియా 6.6 ఎంబీపీఎస్

ఐడియా 6.6 ఎంబీపీఎస్

ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్‌ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. కాగా జియో ఎప్పటికప్పుడూ తన యూజర్లను పెంచుకుంటూ పోతోంది. అలాగే ఆఫర్లను కురిపిస్తూ దిగ్గజాలను ఎప్పటికప్పూడు మట్టి కరిపిస్తున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Jio tops 4G speed in Nov for 11th straight month; beats rivals Voda, Airtel More news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X