ప్రత్యర్థులకు చుక్కలు చూపించే పనిలో జియో కొత్త స్కెచ్
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకువెళుతోంది. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న ఈ టెక్ దిగ్గజం త
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకువెళుతోంది. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ వస్తున్న ఈ టెక్ దిగ్గజం తాజాగా బ్రాడ్ బ్యాండ్ రంగంలోని దిగ్గజాలకు సవాల్ విసిరేందుకు రెడీ అయింది. దాని మంటలు చల్లారకముందే మళ్లీ టీవీల విభాగంలో ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

రిలయన్స్ జియో గిగాఫైబర్ ఎఫ్‌టీటీహెచ్ సర్వీసులతో యూజర్లను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు.

జియో గిగాఫైబర్ ట్రిపుల్ ప్లాన్
జియో గిగాఫైబర్ ట్రిపుల్ ప్లాన్ ద్వారా 100 జీబీ హైస్పీడ్ డేటా (100 ఎంబీపీఎస్ స్పీడ్), అపరిమిత వాయిస్ కాల్స్, జియో యాప్స్ యాక్సెస్, జియో హోమ్ టీవీ సబ్‌స్క్రిప్షన్ వంటి సేవలు అందించే అవకాశముంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండొచ్చు. ప్రస్తుతం ఈ సేవలు కంపెనీ ఉద్యోగులకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

బేసిక్ ప్లాన్ రూ.500
జియో ఫైబర్ వెబ్‌సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం బేసిక్ ప్లాన్ రూ.500 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇందులో యూజర్లు నెల రోజులు 300 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 50 ఎంబీపీఎస్ గా ఉండే అవకాశం ఉంది.

రూ.999 ప్లాన్
ఇక మరో ప్లాన్ రూ.999 లో 30 రోజులు 300 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్ గా ఉంటుందని సమాచారం. ఇక రూ.1,500 ప్లాన్‌లో 30 రోజులపాటు 900 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 150 ఎంబీపీఎస్ గా ఉండనుంది

ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో
కాగా జియో తన ఎఫ్‌టీటీహెచ్ సర్వీసులను ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే అధికారికంగా దీనిపై ఇంకా ఎటువంటి వివరాలు బయటకు రాలేదు


Click it and Unblock the Notifications








