హైదరాబాద్, బెంగళూరు లో Jio 5G లాంచ్ అయింది ! మీ ఫోన్ లో ఎలా పొందాలి ?

By Maheswara
|

Jio నవంబర్ 10, గురువారం నాడు బెంగళూరు మరియు హైదరాబాద్‌ నగరాలలో ట్రూ 5G సేవలను ప్రారంభించింది. దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ దసరా సందర్భంగా ఎంపిక చేసిన నగరాల్లో Jio True-5G సేవలను బీటా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన దాదాపు నెల తర్వాత ఈ కొత్త లాంచ్ వచ్చింది.

 

ఇది వరకు

ఇది వరకు మొత్తం 6 నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి. తర్వాత, Jio రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో తన 5G సేవలను ప్రారంభించింది. బెంగళూరు మరియు హైదరాబాద్‌లో సేవలను పొందేందుకు, జియో వినియోగదారులు 'జియో వెల్‌కమ్ ఆఫర్' కోసం ఆహ్వానం పొందడానికి వేచి ఉండాలి.

జియో 5G

జియో 5G

ఈ జియో 5G సేవలను పొందటానికి ఆహ్వానం పొందిన వారు గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను అనుభవిస్తారు. మునుపటి ప్రకటనల మాదిరిగానే, ఈ లాంచ్ కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వస్తుంది.

"ఈ రెండు టెక్-సెంట్రిక్ సిటీలలో జియో ట్రూ-5G, మానవాళికి సేవ చేసే మరియు భారతీయుల జీవన నాణ్యతను మెరుగుపరిచే కొన్ని తాజా సాంకేతికతల యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది" అని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ట్రూ 5G సేవలను దశల వారీగా భారతదేశంలో విడుదల చేయనున్నట్లు జియో ఇప్పటికే ప్రకటించిన విషయం మీకు తెలిసిందే.

భారతదేశంలోని ఆరు నగరాల్లో
 

భారతదేశంలోని ఆరు నగరాల్లో

గతంలో, జియో భారతదేశంలోని ఆరు నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. వీటిలో ఐదు దసరా సందర్భంగా రోల్‌అవుట్‌ను పొందగా, దీపావళికి ముందు ఆకాష్ అంబానీ సమక్షంలో కంపెనీ నాథ్‌ద్వారాలో సేవలను ప్రారంభించింది.

భారతదేశపు టాప్ టెల్కో కంపెనీ అయిన జియో ప్రకారం, Jio True 5Gని ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 500 Mbps నుండి 1 Gbps మధ్య అధిక వేగంతో ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయగలరు.

మీరు ఆహ్వానాన్ని పొందాలి

మీరు ఆహ్వానాన్ని పొందాలి

జియో టెలికాం కంపెనీ 700 MHz, 3500 MHz మరియు 26 GHz బ్యాండ్‌లలో 5G స్పెక్ట్రమ్ యొక్క అతిపెద్ద మరియు ఉత్తమ మిశ్రమాన్ని కలిగి ఉందని కూడా ప్రకటించింది. అయితే, భారతదేశంలోని అన్ని నగరాలకు ట్రూ 5G డేటాను అందించడానికి జియో ఎటువంటి డేట్ లేదా టైం లైన్ ను ప్రకటించలేదు.

హైదరాబాద్ లో జియో 5G లాంచ్ చేయడం సంతోషకరమైన వార్త, కానీ ప్రతి జియో వినియోగదారుడు ప్రస్తుతం రిలయన్స్ జియో యొక్క 5G నెట్‌వర్క్ సేవలకు యాక్సెస్ పొందలేరు. ప్రస్తుతం, మీరు Jio యొక్క 5G నెట్‌వర్క్ సేవలను యాక్సెస్ చేయాలనుకుంటే తప్పనిసరిగా కంపెనీ నుండి మీరు ఆహ్వానాన్ని పొందాలి.

అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసినట్లైయితే

అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసినట్లైయితే

ఇంకా, మీరు Jio యొక్క 5G నెట్‌వర్క్‌కు ఏ ఆఫర్‌ను యాక్సెస్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే వాటికి కొన్ని  అర్హత గల ప్లాన్‌లు ఉన్నాయి అవి ఏంటో మీకు ఇక్కడ తెలియచేస్తాము. మీరు అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసినట్లైయితే , మీరు Reliance Jio యొక్క 5G సేవలను ఉపయోగించగలరు. ఏది ఏమైనా, దీని గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలను ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

5G కోసం Jio వెల్‌కమ్ ఆఫర్

5G కోసం Jio వెల్‌కమ్ ఆఫర్

మీరు ఏమి చేస్తే 5G ఆహ్వానాన్ని పొందవచ్చు అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్‌లో MyJio యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఇది iOS మరియు Android వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆపై, మీరు అర్హత ఉన్న నగరాల్లో ఉన్నట్లయితే, మీరు MyJio యాప్‌లో సైన్-ఇన్ చేసినప్పుడు స్క్రీన్ పైన Jio యొక్క 5G ఆఫర్‌ను చూస్తారు. Jio దాని 5G నెట్‌వర్క్ యొక్క బీటా ట్రయల్‌లో మీరు భాగం కావాలనుకుంటున్నారని తెలియజేయడానికి మీకు ఆసక్తి ఉందని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా Jio మీకు కన్ఫర్మేషన్ పంపే వరకు వేచి ఉండండి.

 

Best Mobiles in India

Read more about:
English summary
Jio True 5G Launched In Bengaluru And Hyderabad, Internet Speed Will Reach Up To 1Gbps.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X