Home
News

జియో టీవీ ప్రీమియం అదిరిపోయే ప్లాన్స్‌.. రూ.500లోపే అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, 10 OTT ఉచితం

Jio TV Premium: వీడియో స్ట్రీమింగ్ లవర్స్ కోసం రిలయన్స్ జియో అదిరిపోయే కొత్త ప్లాన్స్‌ని లాంచ్ చేసింది. ఈ జియో టీవీ ప్రీమియం ప్లాన్స్‌లో మీకు కావాల్సిన OTT సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు మొబైల్ డేటా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే ఇకపై వేర్వేరుగా స్ట్రీమింగ్ సర్వీసులు కొనుక్కోవాల్సిన పనిలేదు. చాలా తక్కువ ధరలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.175, రూ.445లతో రెండు రకాల ప్లాన్స్‌ని జియో తీసుకొచ్చింది.

వీటిల్లో ఒకటి స్ట్రీమింగ్, డేటా కోసం మాత్రమే అయితే, రెండోది మాత్రం కాలింగ్, అన్‌లిమిటెడ్ 5G యాక్సెస్‌తో పాటు అన్నీ కలిపి వస్తుంది. మీ అవసరానికి తగ్గట్టు ఏ ప్లాన్ కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ముందుగా రూ.175 జియో టీవీ ప్రీమియం ప్లాన్ ప్రయోజనాలు చూద్దాం.

Jio TV Premium Plans Launched  Unlimited Calls  Daily 5G Data  amp amp  10 OTT Subscriptions

* రూ.175 ప్లాన్

OTT ప్లాట్‌ఫామ్స్‌తో పాటు కాస్త డేటా కూడా కావాలనుకునే వాళ్లకి ఈ ప్లాన్ సూపర్ ఛాయిస్. ఇందులో మీకు 10GB హై-స్పీడ్ డేటా వస్తుంది. అది అయిపోయాక స్పీడ్ కాస్త తగ్గి 64 Kbpsకి వస్తుంది. ఇందులో వాయిస్ కాల్స్, SMS బెనిఫిట్స్ ఉండవు. అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లేదు.

కానీ 28 రోజుల పాటు సోనీ LIV, Zee5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కౌవరీ+, సన్ NXT, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్ లాంటి టాప్ 10 OTT ప్లాట్‌ఫామ్స్‌ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ప్లాన్ కేవలం స్ట్రీమింగ్ కోసమే కాబట్టి, రెగ్యులర్ మొబైల్ సర్వీసుల కోసం వేరే జియో ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది.

* రూ.445 జియో టీవీ ప్రీమియం ప్లాన్

ఈ ప్లాన్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కనెక్టివిటీ కూడా కావాలనుకునే యూజర్లకి బాగా సరిపోతుంది. ఇందులో మీకు అన్ని ప్రయోజనాలు ఉంటాయి. రోజుకి 2GB హై-స్పీడ్ డేటా అందిస్తున్నారు. ఇది అయిపోతే స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. అపరిమిత 5G డేటా (జియో వెల్‌కమ్ ఆఫర్ ఉన్నవాళ్లకి మాత్రమే) లభిస్తుంది.

అలాగే లోకల్, STD, రోమింగ్ కాలింగ్స్‌తో సహా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్. రోజుకి 100 SMSలు. రూ.175 ప్లాన్‌లో ఉన్న అవే 10 OTT ప్లాట్‌ఫార్మ్స్‌కి యాక్సెస్. ఫ్యాన్‌కోడ్ స్పోర్ట్స్ కంటెంట్, జియో క్లౌడ్ స్టోరేజ్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

* ఏ ప్లాన్ సరిపోతుంది

మీకు కేవలం OTT యాక్సెస్, అప్పుడప్పుడు డేటా ఉంటే చాలు అనుకుంటే రూ.175 ప్లాన్ మంచి ఆప్షన్. కానీ కాల్స్, SMS కోసం వేరే జియో ప్లాన్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అదే మీకు అన్నీ ఒకే ప్యాక్‌లో కావాలంటే, రోజు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, OTT సబ్‌స్క్రిప్షన్లు అన్నీ కావాలనుకుంటే రూ. 445 ప్లాన్ మీకు కరెక్ట్ ఛాయిస్.

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ టైమ్‌లో, జియో కొత్త ప్లాన్స్‌తో చాలా తక్కువ ధరకే మల్టిపుల్ స్ట్రీమింగ్ సర్వీసులలోని సినిమాలు చూడవచ్చు. నేటి తరంతో పాటు సమానంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio launched Rs 175 & Rs 445 Premium plans with OTT, data, & calling benefits. Rs 175 plan for streaming focus; Rs 445 for all-inclusive pack.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X