Home
News

జియో యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. రూ.26లకే భారీ ఆఫర్, బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..

Jio Rs26 Plan: మంచి డేటా ప్లాన్ కావాలంటే బోలెడు డబ్బులు పెట్టాలనుకుంటున్నారా, అవసరం లేదు. కేవలం రూ.26కే నెల రోజుల వ్యాలిడిటీతో జియో ఒక కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక కప్పు టీ ధర కన్నా తక్కువకే రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ డేటా ప్యాక్, ధర, వ్యాలిడిటీ విషయంలో పోటీ కంపెనీలకు అందనంత దూరంలో ఉంది.

ఇంతకీ ఈ చవక ప్లాన్ ఏంటి? దీని వల్ల ఎవరికి లాభం? ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్‌లతో పోలిస్తే ఇది ఎంత బెటర్? తెలుసుకుందాం. ఈ ప్లాన్ ఎవరికీ సరిపోతుందో కూడా చూద్దాం. అలాగే ఇతర టెలికాం కంపెనీలు ఇంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ల అందిస్తున్నాయి కూడా తెలుసుకుందాం.

Jio Unbeatable Rs 26 Plan Get 2GB Data

* జియో రూ.26 ప్లాన్..
ప్రస్తుతం రిలయన్స్ జియో అందిస్తున్న ప్లాన్స్‌లో అత్యంత చవకైనది ఈ రూ.26 రీఛార్జ్. ఇది కేవలం డేటా కోసం మాత్రమే తెచ్చిన ప్లాన్, ముఖ్యంగా జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకం. ఈ ప్లాన్‌తో మీకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది, అది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.

ఒకవేళ మీరు 2GB డేటా వాడేస్తే? కంగారు పడకండి, ఆ తర్వాత కూడా నెల రోజుల వరకు 64 kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ ప్లాన్‌లో కాల్స్ లేదా SMS బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం ఇంటర్నెట్ డేటా అవసరాల కోసమే.

* ఈ ప్లాన్ ఎవరికి..
ఈ ఆఫర్ కేవలం జియోఫోన్ వాడే వారికి మాత్రమే. జియోఫోన్ వాడుతూ, మీ ప్రస్తుత ప్లాన్‌లోని డేటా అయిపోతే, వెంటనే రూ.26 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుని ఇంటర్నెట్ సేవలను కంటిన్యూ చేయవచ్చు. దీన్ని మైజియో యాప్ లేదా Jio.com వెబ్‌సైట్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడున్నా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

* ఎయిర్‌టెల్, Vi లలో ఇలాంటి ప్లాన్స్ ఎలా ఉన్నాయి..?
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కూడా దాదాపు ఇదే ధరలో (రూ.26) డేటా ప్యాక్స్ అందిస్తున్నాయి. కానీ, వ్యాలిడిటీ విషయంలో జియోతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు 1.5GB డేటాను కేవలం ఒక్క రోజు వ్యాలిడిటీతో మాత్రమే ఇస్తున్నాయి.

అదే జియో రూ. 26కే ఏకంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, జియో రూ.26 ప్లాన్ కేవలం చౌకైనదే కాదు, ఈ ధరలో అత్యంత ఎక్కువ ప్రయోజనం (Value for Money) ఇచ్చే ప్లాన్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లాన్ ప్రయోజనాలను ఇప్పుడే సద్వినియోగం చేసుకోండి.

* ఇతర అందుబాటు ధరల్లో జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ (రూ.350లోపు)
జియో ఇంకా కొన్ని తక్కువ ధరలో మంచి ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వాటిలో ఒకటి రూ.189 ప్లాన్, ఇది మొత్తం 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS, 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. జియోటీవీ, జియోసినిమా (బేసిక్), జియోక్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.

రూ.198 ప్లాన్ రోజుకు 2GB 5G డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS, 14 రోజుల వ్యాలిడిటీ. జియో యాప్స్ యాక్సెస్ కూడా ఉంటుంది. రూ.249 ప్లాన్ అనేదు రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ. జియోటీవీ, జియోసినిమా చూడొచ్చు.

రూ.299 ప్లాన్ అనేది రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీతో పాటు జియో యాప్స్ యాక్సెస్ పొందవచ్చు. రూ. 349 ప్లాన్ అనేది రోజుకు 2GB 5G డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ. దీనికి అదనంగా 3+ OTT ప్లాట్‌ఫామ్‌లు, జియో యాప్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది. కాబట్టి, మీ అవసరాన్ని బట్టి ఈ చౌక ప్లాన్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Unbeatable Rs26 Plan Get 2GB Data with 28-Day Validity, Outshining Airtel and Vi Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X