జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇలా Spam కాల్స్, మెసేజ్‌లకు చెక్ పెట్టవచ్చు..! పూర్తి వివరాలు
స్పామ్ కాల్స్, స్పామ్ మెసెజ్ ల సమస్య రోజురోజుకు అధికమవుతోంది. వివిధ సంస్థలు, ఆఫర్ల పేర్లతో కాల్స్ సహా SMS లు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్ కట్టడి చేస్తోంది. దీంతోపాటు BSNL కూడా స్పామ్ బ్లాకర్ లను అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే తెలిపింది.
అయితే ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ వంటి వ్యవస్థలకు చిక్కకుండా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో జియో యూజర్లకు (Jio) ఈ తరహా సమస్యలు ఎదురవ్వకుండా My Jio యాప్ ద్వారా పూర్తిస్థాయిలో స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లను నియంత్రించే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అవసరమైన కాల్స్, మెసేజ్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెట్టింగ్స్ లో మార్పులు చేయవచ్చు.

జియో యూజర్లు.. (Jio Spam Control methods) స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేసేందుకు DND (Do Not Disturb) ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా స్పామ్ తో పాటు టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను కూడా బ్లా్క్ చేస్తుంది. దీంతోపాటు మరిన్ని కేటగిరీలకు చెందిన కాల్స్, మెసేజ్‌లను కూడా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
My Jio DND ఆప్షన్ లో బ్యాంకింగ్, హెల్త్, టూరిజం సహా అనేక కేటగిరీలకు చెందిన కాల్స్, మెసేజ్‌లపై నియంత్రణ విధించవచ్చు. దీంతోపాటు పూర్తి స్థాయిలో ఈ తరహా కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్‌లు సహా ఇతర ముఖ్యమైన సమాచారం అందుకోవచ్చు.
ఎక్కువగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు పూర్తి స్థాయిలో బ్లాక్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం మై జియో యాప్‌లోని DND ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం Fully Enable ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫలితంగా అవసరం లేని అన్ని కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేసుకోవచ్చు.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ గతనెలలో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పామ్ డిటెక్షన్ సిస్టమ్‌ను లాంచ్ చేసిన తొలి టెలికాం నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ప్రస్తుతం ఈ సర్వీసులను ఉచితంగానే ఎయిర్‌టెల్ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్‌టెల్ స్పామ్ డిటెక్షన్ సొల్యుషన్ డ్యూయల్ లేయర్ రక్షణ ను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. నెట్‌వర్క్, ఐటీ సిస్టమ్ స్థాయిల్లో రెండు ఫిల్టర్‌లను కలిగి ఉంటుంది. ప్రతి SMS మరియు కాల్ డ్యూయల్ లేయర్ AI షీల్డ్‌ను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా SMS ల ద్వారా వచ్చే URL లపైనా యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్‌ను కలిగి ఉన్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారా యూజర్లకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం లభించినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








