Home
News

బెస్ట్ టాప్ అప్ రీఛార్జ్ ప్లాన్లు, సెలక్షన్ మీదే..

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతుందే కాని దాని మంటలు చల్లారడం లేదు. దిగ్గజాలన్నీ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీలు పడుతూ అత్యంత తక్కువ ధరకే డేటా , కాల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి.

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతుందే కాని దాని మంటలు చల్లారడం లేదు. దిగ్గజాలన్నీ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీలు పడుతూ అత్యంత తక్కువ ధరకే డేటా , కాల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ఏది మంచి ప్లాన్ అని తెలియక ఒక్కోసారి సతమతవుతున్నారు. అన్ని టెల్కోలు బెస్ట్ ప్లాన్లను అందించడంతో వినియోగదారుడు బెస్ట్ ఏదో తెలియక అయోమయానికి గురవతున్నాడు. ఈ శీర్షికలో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో డైలీ డేటా అదనపు ఫీచర్లను అందిస్తున్న అన్ని నెట్ వర్క్ ల వివరాలను ఇస్తున్నాం. బెస్ట్ ఏదో మీరే సెలక్ట్ చేసుకోండి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో

ఈ దిగ్గజం రోజుకు 2జిబి, 3జిబి, 4జిబి, 5జిబి డేటా ప్లాన్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. జియో రూ. 198 ప్లాన్ ద్వారా 28 రోజులకు 2జిబి డేటాను అందిస్తోంది. దీంతో పాటు 100 ఎస్సెమెస్ లను కూడా అందిస్తోంది. అలాగే రూ.299 ప్లాన్లో రోజుకు 3జిబి డేటా, రూ.509 ప్లాన్లో రోజుకు 4జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. ఇంకా ఎక్కువ డేటా కావాలనుకున్నవారు రూ.709 ప్లాన్ కి మారవచ్చు. ఈ ప్లాన్లో రోజుకు 5జిబి డేటా చొప్పున మొత్తం 140 జిబి డేటాను అందిస్తోంది.

జియో రూ.100లోపు ప్లాన్లు

జియో రూ.100లోపు ప్లాన్లు

జియోలో రూ.11, రూ.21, రూ.51, పేరిట మూడు యాడాన్ ప్యాక్స్ ప్రస్తుతం కస్టమర్లకు లభిస్తున్నాయి. వీటికి ప్రత్యేకమైన వాలిడిటీ ఏమీ లేదు. కస్టమర్ వాడుతున్న ప్లాన్ వాలిడిటీ ఎప్పటి వరకు ఉంటే అదే వాలిడిటీ ఈ ప్యాక్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇక ఈ ప్యాక్స్‌లో రూ.11కు 400 ఎంబీ మొబైల్ డేటా, రూ.21కి 1 జీబీ, రూ.51కి 3 జీబీ, లభిస్తుంది.

 

 

వొడాఫోన్

వొడాఫోన్

ఈ టెలికాం రూ.255 ప్లాన్లో భాగంగా రోజుకు 2జిబి డేటా అలాగే అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ 100 ఎస్మెమెస్ లను 28 రోజుల పాటు అందిస్తోంది. ఇంకా అదనపు డేటా కావాలనుకున్నవారు రూ.349, రూ. 549 ప్లాన్లకు మారవచ్చు. ఇందులో రోజుకు 3జిబి డేటా, అలాగే రూ.549 ప్లాన్లో రోజుకు 3.5జిబి డేటాను కంపెనీ అందిస్తోంది. ఇంకా ఎక్కువ డేటా కావాలనుకున్న వారికి రూ. 799 ప్లాన్లో రోజుకి 4.5 జిబి డేటాను అందిస్తోంది. కాల్స్, మెసేజ్ లు పై ప్లాన్లలాగానే లభిస్తాయి.

 

 

వొడాఫోన్ రూ.100లోపు ప్లాన్లు

వొడాఫోన్ రూ.100లోపు ప్లాన్లు

రూ.27 ప్లాన్ లో 450MB 2G/3G/4Gడేటా ఉంటుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు . అలాగే రూ.49 ప్లాన్లో 1GB 2G/3G/4G డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అలాగే రూ.98 ప్లాన్లో 3GB 2G/3G/4G డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. ఇది దాటితే నార్మల్ ఛార్జి చేస్తారు.

 

 

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

28 రోజుల పాటు మరింత డేటా కావాల్సిన వారు ఎయిర్‌టెల్ రూ. 249,రూ.349 ప్లాన్లలోకి మారవచ్చు. రూ. 249 ప్లాన్ లో రోజుకు 2జిబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ 100 ఎసెమ్మెస్ లను ఈ ప్లాన్ లో అందిస్తోంది. అలాగే రూ.349 ప్లాన్లో రోజుకు 3జిబి డేటా అన్ లిమిటెడ్ కాల్స్ 100 ఎసెమ్మెస్ లను 28 రోజుల పాటు అందిస్తోంది.

 

 

ఎయిర్‌టెల్ రూ.100లోపు ప్లాన్లు

ఎయిర్‌టెల్ రూ.100లోపు ప్లాన్లు

రూ.29 ప్లాన్ లో 520MB 2G/3G/4G డేటా ఉంటుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు . అలాగే రూ.48 ప్లాన్లో 1GB హై స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అలాగే రూ.98 ప్లాన్లో 3GB హై స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio V Airtel V Vodafone: Best top-up recharge plans you can opt for More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X