జియో బంపరాఫర్, రూ.10 వేల వరకు బెనిఫిట్స్
చైనాకు చెందిన ప్రముఖ మొబల్ తయారీ కంపెనీ వివో ఫోన్ల మీద దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బంపరాఫర్లను ప్రకటించింది. సమ్మర్ సీజన్ లో క్రికెట్ అభిమానుల కోసం ఏకంగా రూ. 10 వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వివో ఫ్లాట్ షిఫ్ ఫోన్లు అయిన వివో వి15, వివో వి15 ప్రొ ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు జియో ఈ బంపరాఫర్ ను ప్రకటించింది. జియో వివో క్రికెట్ ఆఫర్ కింద వారికి రూ.10వేల విలువైన బెనిఫిట్స్‌ను ఉచితంగా అందిస్తున్నది. మరి ప్రాసెస్ ఏంటీ దాని ప్రయోజనాలు ఎలా పొందాలో ఓ సారి చూద్దాం.

రూ.299 జియో ప్రీపెయిడ్ ప్లాన్
ముందుగా వివో ఫోన్ల వినియోగదారులు రూ.299 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. దీంతో వారికి 3.3 టీబీ వరకు 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే పేటీఎం, బెహ్రూజ్ బిర్యానీ, ఫాసొస్, మింత్రా, ఫస్ట్‌క్రై, జూమ్ కార్, క్లియర్‌ట్రిప్‌లకు చెందిన రూ.4వేల విలువైన కూపన్ బెనిఫిట్స్ లభిస్తాయి.

రూ.6వేల విలువైన జియో కూపన్లు
దీంతోపాటు ఒక్కోటి రూ.150 విలువైన 40 కూపన్లు కలిపి మొత్తం రూ.6వేల విలువైన జియో కూపన్లు లభిస్తాయి. దీంతో వినియోగదారులకు మొత్తం రూ.10వేల విలువైన బెనిఫిట్స్ అందుతాయి.

త్వరలో మార్కెట్లోకి మరో వివో ఫోన్
వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు రెడీ అయ్యింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కేటగిరి అయిన వై సిరీస్‌లో వివో వై5 ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. వివో వై5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపే ఉండొచ్చు.వివో కొత్త ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఏప్రిల్ 15న లేదా అంతకన్నా ముందే ఈ ఫోన్ మార్కెట్‌లోకి రావొచ్చని సమాచారం.

వివో వి15 ప్రొ ఫీచర్లు
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్.

వివో వి15 ఫీఛర్లు
6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








