జియో vs ఎయిర్‌టెల్: సరసమైన ధరలో OTT ప్రయోజనాలతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు...

|

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా తన యొక్క వినియోగదారులకు వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా కొన్ని రకాల ప్లాన్ లను అందిస్తున్నాయి. అయితే మీరు ప్రీపెయిడ్ కాకుండా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లని ఎంచుకోవాలని చూస్తున్నట్లయితే కనుక టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా అనేక రకాల ప్రయోజనాలతో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. అయితే వినియోగదారులు సరసమైన ధర ట్యాగ్‌తో అదనంగా OTT ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలను కోరుకునే వారు కూడా ఉన్నారు. జియో మరియు ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కూడా తమ యొక్క సబ్‌స్క్రైబర్‌ల కోసం అనేక రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే అధిక మొత్తంలో వినోదంను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని OTT సబ్‌స్క్రిప్షన్‌లతో లభించే జియో మరియు ఎయిర్‌టెల్ యొక్క సహేతుకమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు

జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు

జియో సంస్థ తన యొక్క వినియోగదారులకు అన్ని రకాల ధరల వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో అందించే దాదాపు అన్ని ప్లాన్‌లు OTT సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తాయి. రూ.399 ధర వద్ద లభించే జియో ప్లాన్ ఒక నెలకు 75GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు రూ.10/GBకి ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్యాక్ 200GB డేటా రోల్‌ఓవర్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. టెల్కో యొక్క తదుపరి ప్లాన్ రూ.599 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఇది వినియోగదారులకు 200GB రోల్‌ఓవర్ డేటాతో 100GB డేటాను అందిస్తుంది. 100GB వినియోగం తర్వాత వినియోగదారులు రూ.10 చెల్లించి 1GB డేటాను వినియోగించవచ్చు. ఈ ప్లాన్ ఒక అదనపు SIM కార్డ్‌ని కూడా అందిస్తుంది. అలాగే ఇది రోజుకు 100 SMSలతో పాటుగా అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది.

జియో
 

జియో టెల్కో తన యొక్క వినియోగదారులకు అందుబాటు ధరలో అందించే ముఖ్యమైన ప్లాన్‌లలో ఒకటి రూ.799 ధర ట్యాగ్‌తో లభించే ప్లాన్. ఈ ప్లాన్‌తో యూజర్లు అదనంగా రెండు SIM కార్డ్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తంగా 150GB డేటాను అందించడమే కాకుండా 200GB డేటా రోల్‌ఓవర్‌ను అనుమతిస్తుంది. 150GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు రూ.10/GB ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. జియో టెల్కో అందుబాటు ధరలో అందించే పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు మూడు అదనపు SIM కార్డ్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తంగా 200GB డేటాను అందిస్తు 500GB వరకు డేటా రోల్‌ఓవర్‌ను అనుమతిస్తుంది. ఈ ప్లాన్ మూడు సిమ్ లకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌కు సభ్యత్వాన్ని అందిస్తాయి.

ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు

భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో అత్యంత సమర్థవంతమైన నెట్‌వర్క్‌లను కలిగిన ఎయిర్‌టెల్ టెల్కో కూడా అందుబాటు ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఈ టెల్కో చాలా ఖరీదైన ప్లాన్‌లను కలిగి ఉన్నప్పటికీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన సరసమైన ప్లాన్‌లు రెండు ఉన్నాయి. ఈ జాబితాలోని మొదటి ప్లాన్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ 499. ఇది రూ.499 ధర ట్యాగ్‌తో లభిస్తూ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఇది 75GB నెలవారీ డేటాను మరియు లోకల్, STD మరియు రోమింగ్‌తో సహా అపరిమిత కాల్‌లను మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది కూడా ప్లాటినమ్ ప్యాక్ కాబట్టి వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినమ్ రివార్డ్‌లకు యాక్సెస్ ను పొందుతారు. ఇందులో భాగంగా అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మరియు Disney+ Hotstar VIP మెంబర్‌షిప్ ప్రయోజనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలలో Airtel X-stream App ప్రీమియం, Wynk ప్రీమియం మరియు మరిన్ని ఉన్నాయి.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ యొక్క సరసమైన ప్లాన్‌ల జాబితాలోని మరొకటి ఫ్యామిలీ ఇన్ఫినిటీ 999 ప్లాన్. ఇది రూ.999 ధరతో వినియోగదారులకు అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు 200 GB రోల్‌ఓవర్‌తో 150 GB నెలవారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఫ్యామిలీ సభ్యుల కోసం 1 సాధారణ సిమ్ మరియు 2 ఉచిత యాడ్-ఆన్ సాధారణ వాయిస్ కనెక్షన్‌లను పొందుతారు. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్‌లను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Jio VS Airtel: Affordable Postpaid plans Comes With More OTT Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X