Home
News

భారీగా డేటా వాడేస్తున్నారా.. ఎయిర్‌టెల్ vs జియోల 3GB డైలీ డేటా ప్లాన్లలో ఏది బెస్ట్?

By Ram Kumar

స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు, ఓటీటీ సినిమాలు చూస్తూ డేటా తెగ వాడేస్తున్నారా? అయితే రోజుకి 3GB డేటా ఇచ్చే ప్లాన్లు మీకు బాగా సరిపోతాయి. పైగా ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ రెండూ కూడా అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ చేస్తున్నాయి. అయితే, వీటి ధరల్లో, బెనిఫిట్స్‌లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించే వివరంగా తెలుసుకుందాం.

Jio vs Airtel  Comparing Prepaid Plans with 3GB Daily Data

* జియో ధరలు పెరిగాయి, కానీ 5G ఫ్రీ..

ఇటీవల జియో తన టారిఫ్ ధరలను పెంచింది. ఇంతకుముందు రూ.239తో మొదలయ్యే ప్లాన్లు ఇప్పుడు రూ.349 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కానీ రోజుకి 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ఇచ్చే అన్ని ప్లాన్లపై అన్‌లిమిటెడ్ 5G డేటా ఫ్రీగా ఇస్తోంది.

మరోవైపు, ఎయిర్‌టెల్ మాత్రం తన 5G డేటా ప్లాన్‌ల ధరలను పెంచలేదు. ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లు రూ.379 నుంచే మొదలవుతున్నాయి. అంటే, జియోతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధర.

* జియో vs ఎయిర్‌టెల్ 3GB డేటా ప్లాన్లు

అసలు విషయానికి వస్తే, రోజుకి 3GB డేటా ఇచ్చే ప్లాన్లు హెవీ డేటా యూజర్లకి లేదా వైఫై లేని వాళ్లకి బాగా ఉపయోగపడతాయి. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 SMSలతో పాటు, కొన్ని ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న 3GB డేటా ప్లాన్లను ఒకసారి చూద్దాం.

* జియో 3GB డైలీ డేటా ప్లాన్లు

- రూ.449 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో, రోజుకి 3GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 SMS లభిస్తాయి. అంతేకాదు జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు.

- రూ.1199 ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీతో, పైన చెప్పిన బెనిఫిట్స్‌తో పాటు జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ అదనంగా లభిస్తాయి.

రూ.1799 ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీతో, పైన చెప్పిన అన్ని బెనిఫిట్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్ సబ్‌స్క్రిప్షన్), జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ లభిస్తాయి.

* ఎయిర్‌టెల్ 3GB డైలీ డేటా ప్లాన్లు

- రూ.449 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో, రోజుకి 3GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS వస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (22+ ఓటీటీలు), అపోలో 24|7 (3 నెలలు), ఫ్రీ హలోట్యూన్స్‌ లభిస్తాయి.

- రూ.549 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో, పైన చెప్పిన బెనిఫిట్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ (3 నెలలు), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, అపోలో 24|7, ఫ్రీ హలోట్యూన్స్ లభిస్తాయి.

- రూ.838 ప్లాన్

56 రోజుల వ్యాలిడిటీతో, రోజుకి 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS/రోజు (ఇందులో అన్‌లిమిటెడ్ 5G లేదు). అలాగే అమెజాన్ ప్రైమ్ (56 రోజులు), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, అపోలో 24|7, ఫ్రీ హలోట్యూన్స్ ఫ్రీ.

- రూ.1798 ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీతో, రోజుకి 3GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS/రోజు. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్ సబ్‌స్క్రిప్షన్), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, అపోలో 24|7, ఫ్రీ హలోట్యూన్స్ లభిస్తాయి.

* కీలకమైన తేడాలు

జియో ప్లాన్లలో అన్నింటికీ అన్‌లిమిటెడ్ 5G లభిస్తుంది, అలాగే రూ.1799 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ కూడా ఇస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను వివిధ ప్లాన్లలో అందిస్తోంది. కాబట్టి, మీకు ఏ ఓటీటీ కావాలనే దానిపై మీ ఛాయిస్ ఆధారపడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio and Airtel offer unlimited 5G on 3GB daily data plans. Both provide calls, SMS, and extra benefits like OTT subscriptions; Jio includes Netflix on some plans, while Airtel offers a wider variety.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X